TS DEECET: డీఎడ్ కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం, ఆందోళనలో అభ్యర్థులు
తెలంగాణలో ఇంటర్ విద్యార్హతతో డీఎడ్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్-2023' కౌన్సెలింగ్‌లో జాప్యం కారణంగా విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
తెలంగాణలో ఇంటర్ విద్యార్హతతో డీఎడ్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్-2023' కౌన్సెలింగ్‌లో జాప్యం కారణంగా విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరీక్ష జూన్ 1న నిర్వహించారు. జూన్ 14న ఫలితాలు వెల్లడించారు. నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు కౌన్సెలింగ్ మాత్రం నిర్వహించడం లేదు. డిగ్రీ లేదా ఇతర కోర్సుల్లో చేరాలో.. డీఎడ్‌లో ప్రవేశాల కోసం ఆగాలో విద్యార్థులు తేల్చుకోలేకపోతున్నారు.
పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులతోపాటు మేనేజ్‌మెంట్ కోటా కింద చేరాలనుకుంటున్న అభ్యర్థులు కన్వీనర్ కార్యాలయానికి ఫోన్లు చేస్తున్నా.. అధికారుల నుంచి ఎలాంటి స్పందనలేదు. సిబ్బంది సైతం కళాశాలల జాబితా పంపాలని ఎస్‌సీఈఆర్‌టీ అధికారులను కోరుతున్నారు. ఈ మొత్తం జాప్యానికి కారణం పాఠశాల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే అని తెలుస్తోంది. నిరుడూ నెలల తరబడి జాప్యం తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించడంతో 20 కళాశాలలు ప్రవేశాలు చేపట్టలేదు.
గతంతో పోలిస్తే డీఎడ్ కోర్సు అందించే కళాశాలల సంఖ్య బాగా తగ్గిపోయింది. 2016-17లో 212 కళాశాలలుండగా... నిరుడు 109కి తగ్గింది. డీఎడ్ కోర్సుతోపాటు డైట్ కళాశాలలపైనా విద్యాశాఖ గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలున్నాయి. కొన్నిచోట్ల కళాశాలల స్థలాలను రైతుబజార్ల నిర్వహణకు ఇస్తున్నారు. కొంతకాలంగా అధ్యాపకుల నియామకాలూ లేవు.
ALSO READ:
ఐఐఏడీ-న్యూఢిల్లీలో యూజీ, పీజీ కోర్సులు - వివరాలు ఇలా
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ (ఐఐఏడీ) 2023-24 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సు్ల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా డిసెంబరు 6లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. డిసెంబరు 16, 17 తేదీల్లో ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, సీట్ల వివరాలు ఇలా!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ డిజైన్(బీడిజైన్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, అహ్మదాబాద్, హరియాణా, మధ్యప్రదేశ్, అసోంలో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు, వివరాలు ఇలా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల మాస్టర్ ఆఫ్ డిజైన్(బీడిజైన్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, గాంధీనగర్‌లో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..