CUET PG 2022 Exam Date: కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీ) తేదీలు వెల్లడి, వివరాలు ఇలా!
సెంట్రల్ యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం 2022-2023 విద్యాసంవత్సరం నుంచి కామన్ ప్రవేశపరీక్ష(సెట్) నిర్వహించనున్నట్లు యూజీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ CUET(PG)-2022 తేదీలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు పరీక్షల తేదీలను కమిషన్ ఛైర్మన్ జగదీశ్ కుమార్ ఆగస్టు 2న ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీని ప్రకారం సెప్టెంబరు 1-7 వరకు, 9-11 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి దేశంలోని 66 సెంట్రల్ యూనివర్సిటీలు, దాని అనుబంధ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది.
ప్రవేశ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డు, పరీక్ష నగరం వివరాలను తర్వాత వెల్లడించనున్నట్లు జగదీశ్ కుమార్ తెలిపారు. పరీక్ష పేపర్ కోడ్, పరీక్ష సమయం, పరీక్షల పూర్తి షెడ్యూలును ఎన్టీఏ ప్రకటిస్తుందని ఆయన వెల్లడించారు.
అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం కోసం ఎన్టీఏ, సీయూఈటీ (nta.ac.in, cuet.nta.nic.in) వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పరీక్షకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే cuet-pg@nta.ac.in చిరునామాకు మెయిల్ చేయవచ్చని యూజీసీ ఛైర్మన్ వెల్లించారు.
The dates for CUET (PG) – 2022 are: 01, 02, 03, 04, 05, 06, 07, 09, 10, 11 September 2022. The dates of Advance City Intimation and Release of Admit Card will be announced later on. The detailed Schedule along with the Test Paper Code and Shift/Time will be announced by NTA.
— Mamidala Jagadesh Kumar (@mamidala90) August 2, 2022
సెంట్రల్ యూనివర్సిటీల్లోని డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం 2022-2023 విద్యాసంవత్సరం నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(NTA) ద్వారా కామన్ ప్రవేశపరీక్ష(సెట్) నిర్వహించనున్నట్లు యూజీసీ గతేడాదే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పీజీకోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీ) తేదీలను యూజీసీ ప్రకటించింది.
పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సాధ్యమైనచోట నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్)స్కోర్‌ను ఉపయోగించుకోవాలని యూజీసీ సూచించింది. ప్రస్తుతం జేఈఈ, ఎన్‌ఈఈటీ పరీక్షలను ఎన్‌టీఏ నిర్వహిస్తున్న మాదిరిగా 13 భాషల్లో ఈ సెట్ నిర్వహించే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర, ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఇష్టపడితే వారు కూడా ఈ సెట్‌ను స్వీకరించవచ్చని యూజీసీ పేర్కొంది.
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ మార్కులకు అడ్మిషన్లలో ఎలాంటి వెయిటేజీ ఉండదు. కేవలం ఎంట్రన్స్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగానే ప్రవేశం కల్పిస్తారు. ఎన్‌టీఏ తయారుచేసే మెరిట్ లిస్ట్ ఆధారంగా యూనివర్సిటీలు వేటికవే అడ్మిషన్లు చేపడతాయి. కామన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఉండదు.
నూతన విద్యా విధానం (NEP)- 2020లో సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను ప్రతిపాదించారు. కేంద్ర విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం పద్ధతులను సిఫారసు చేయాలంటూ ఏడుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది పరీక్ష నిర్వహించాలని భావించినా సాధ్యపడలేదు.
ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు ఇవే..
ALIGARH MUSLIM UNIVERSITY
ASSAM UNIVERSITY
BABASAHEB BHIMRAO AMBEDKAR UNIVERSITY
BANARAS HINDU UNIVERSITY
CENTRAL SANSKRIT UNIVERSITY
CENTRAL TRIBAL UNIVERSITY OF ANDHRA PRADESH
CENTRAL UNIVERSITY OF ANDHRA PRADESH
CENTRAL UNIVERSITY OF GUJARAT
CENTRAL UNIVERSITY OF HARYANA
CENTRAL UNIVERSITY OF HIMACHAL PRADESH
CENTRAL UNIVERSITY OF JAMMU
CENTRAL UNIVERSITY OF JHARKHAND
CENTRAL UNIVERSITY OF KARNATAKA
CENTRAL UNIVERSITY OF KASHMIR
CENTRAL UNIVERSITY OF KERALA
CENTRAL UNIVERSITY OF ODISHA
CENTRAL UNIVERSITY OF RAJASTHAN
CENTRAL UNIVERSITY OF SOUTH BIHAR
CENTRAL UNIVERSITY OF TAMIL NADU
- HARISINGH GOUR VISHWAVIDYALAYA
GURU GHASIDAS VISHWAVIDYALAYA
HEMVATI NANDAN BAHUGUNA GARHWAL UNIVERSITY
INDIRA GANDHI NATIONAL TRIBAL UNIVERSITY
JAMIA MILLIA ISLAMIA
JAWAHARLAL NEHRU UNIVERSITY
MAHATMA GANDHI ANTARRASHTRIYA HINDI VISHWAVIDYALAYA
MAHATMA GANDHI CENTRAL UNIVERSITY
MANIPUR UNIVERSITY
MAULANA AZAD NATIONAL URDU UNIVERSITY
MIZORAM UNIVERSITY
NAGALAND UNIVERSITY
NATIONAL SANSKRIT UNIVERSITY
NORTH-EASTERN HILL UNIVERSITY
PONDICHERRY UNIVERSITY
RAJIV GANDHI UNIVERSITY
SHRI LAL BAHADUR SHASTRI NATIONAL SANSKRIT UNIVERSITY
SIKKIM UNIVERSITY
TEZPUR UNIVERSITY
THE ENGLISH AND FOREIGN LANGUAGES UNIVERSITY
TRIPURA UNIVERSITY
UNIVERSITY OF ALLAHABAD
UNIVERSITY OF DELHI
UNIVERSITY OF HYDERABAD
VISVA-BHARATI UNIVERSITY
BARKATULLAH UNIVERSITY
DEVI AHILYA VISHWAVIDYALAYA
- A.P.J. ABDUL KALAM TECHNICAL UNIVERSITY
- B.R. AMBEDKAR SCHOOL OF ECONOMICS UNIVERSITY
- B.R. AMBEDKAR UNIVERSITY DELHI
JHARKHAND RAKSHA SHAKTI UNIVERSITY
JIWAJI UNIVERSITY
MADAN MOHAN MALAVIYA UNIVERSITY OF TECHNOLOGY
MAHATMA JYOTIBA PHULE ROHILKHAND UNIVERSITY
SARDAR PATEL UNIVERSITY OF POLICE SECURITY AND CRIMINAL JUSTICE
SHRI MATA VAISHNO DEVI UNIVERSITY
VIKRAM UNIVERSITY
AVINASHILINGAM INSTITUTE FOR HOME SCIENCE AND HIGHER EDUCATION FOR WOMEN
CHINMAYA VISHWAVIDYAPEETH
DAYALBAGH EDUCATIONAL INSTITUTE
GUJARAT VIDYAPITH
GURUKULA KANGRI
JAMIA HAMDARD
LAKSHMIBAI NATIONAL INSTITUTE OF PHYSICAL EDUCATION
MANAV RACHNA INTERNATIONAL INSTITUTE OF RESEARCH AND STUDIES
NATIONAL RAIL AND TRANSPORTATION INSTITUTE
PONNAIYAH RAMAJAYAM INSTITUTE OF SCIENCE AND TECHNOLOGY
SHOBHIT UNIVERSITY
TATA INSTITUTE OF SOCIAL SCIENCES (TISS)
THE GANDHIGRAM RURAL INSTITUTE (DTBU)
APEX UNIVERSITY
ARUNACHAL UNIVERSITY OF STUDIES
BENNETT UNIVERSITY
BML MUNJAL UNIVERSITY
CAREER POINT UNIVERSITY
CHHATRAPATI SHIVAJI MAHARAJ UNIVERSITY
GALGOTIAS UNIVERSITY
IES UNIVERSITY
IIMT UNIVERSITY
JAGAN NATH UNIVERSITY BAHADURGARH HARYANA
JAGANNATH UNIVERSITY
JAYPEE UNIVERSITY OF INFORMATION TECHNOLOGY
K.R. MANGALAM UNIVERSITY
MANAV RACHNA UNIVERSITY
MEWAR UNIVERSITY
NICMAR UNIVERSITY, PUNE
NIIT UNIVERSITY
NIRWAN UNIVERSITY, JAIPUR
RNB GLOBAL UNIVERSITY
SRM UNIVERSITY
TEERTHANKER MAHAVEER UNIVERSITY