News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CSL: కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు

కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్, మెరైన్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ 2023 విద్యా సంవత్సరానికి గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్, మెరైన్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ 2023 విద్యా సంవత్సరానికి గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్‌ (మెకానికల్ ఇంజినీరింగ్, మెకానికల్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రోగ్రామ్ వివరాలు..

* గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్

సీట్ల సంఖ్య: 114.

కోర్సు వ్యవధి: 12 నెలలు- రెసిడెన్షియల్

బ్యాచ్‌ల సంఖ్య: 02

అర్హత: బీఈ, బీటెక్‌ (మెకానికల్ ఇంజినీరింగ్, మెకానికల్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్‌ మెరిట్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌, సైకలాజికల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2023.

Notification 

Website

ALSO READ:

ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్‌ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా బీఏ-బీఈడీ, బీఎస్‌ఈ-బీఈడీ, బీకాం-బీఈడీలను ప్రవేశపెట్టాలనే కేంద్రం నిర్ణయం మేరకు ఆ కోర్సులను రాష్ట్రంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఈ సంవత్సరమే కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లు ఐదు ఉండగా వాటిలో ఉన్న కోర్సుల్లో సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరుపుతారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో మ‌రో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి
తెలంగాణలో మ‌రో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. కోర్ గ్రూపుల్లో సీట్లు వెన‌క్కి ఇస్తామ‌ని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూట‌ర్ కోర్సుల్లో సీట్లకు అనుమ‌తి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఖరారు చేసింది. ఫ‌లితంగా అద‌న‌పు సీట్లతో ఏటా స‌ర్కారుపై రూ. 27.39 కోట్ల భారం ప‌డ‌నుంది. ఇటీవ‌ల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వగా, తాజాగా అనుమ‌తిచ్చిన వాటితో క‌లిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది.
సీట్ల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 09 Jul 2023 09:57 PM (IST) Tags: Cochin Shipyard CSL Notification CSL Admissios Graduate Marine Engineering program

ఇవి కూడా చూడండి

UK Visa Fee Hike: యూకే వీసా ఫీజు పెంపు విద్యార్థులు, కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

UK Visa Fee Hike: యూకే వీసా ఫీజు పెంపు విద్యార్థులు, కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

Inter Admissions: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!

Inter Admissions: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!

SA Exams: సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షల సమయాల్లో మార్పులు, మారిన షెడ్యూలు ఇలా

SA Exams: సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షల సమయాల్లో మార్పులు, మారిన షెడ్యూలు ఇలా

IWST: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరులో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్

IWST: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరులో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్

Dussehra Holidays: స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులు ఖరారు, ఎన్నిరోజులంటే? ఏపీలో ఇలా!

Dussehra Holidays: స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులు ఖరారు, ఎన్నిరోజులంటే? ఏపీలో ఇలా!

టాప్ స్టోరీస్

YSRCP Nominated posts: వైసీపీలో త్వరలో నామినేటెడ్‌ పదవుల భర్తీ-ఎన్నికల వేళ సీఎం జగన్‌ వ్యూహం

YSRCP Nominated posts: వైసీపీలో త్వరలో నామినేటెడ్‌ పదవుల భర్తీ-ఎన్నికల వేళ సీఎం జగన్‌ వ్యూహం

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

MS Dhoni: మహీ లేకుండా తొలి వన్డే ప్రపంచకప్‌! టీమ్‌ఇండియాకు నెర్వస్‌ ఫీలింగ్‌!

MS Dhoni: మహీ లేకుండా తొలి వన్డే ప్రపంచకప్‌! టీమ్‌ఇండియాకు నెర్వస్‌ ఫీలింగ్‌!