అన్వేషించండి

SA1 Exams: ఆ రెండు జిల్లాల విద్యార్థులకు అలర్ట్, మారిన 'ఎస్ఏ-1' పరీక్షల షెడ్యూలు!!

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాల పరీక్ష షెడ్యూల్‌ను మార్చుతూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఈమేరకు అక్టోబరు 25న ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు రాసే సమ్మేటివ్‌ అస్సెస్‌మెంట్‌ (ఎస్‌ఏ-1) పరీక్షల షెడ్యూల్‌ రెండు జిల్లాల్లో మళ్లీ మారింది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాల పరీక్ష షెడ్యూల్‌ను మార్చుతూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఈమేరకు అక్టోబరు 25న ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారమైతే నవంబర్‌ 1 నుంచి 7 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఉప ఎన్నిక కారణంగా ఆ రెండు జిల్లాల్లో మాత్రం నవంబర్‌ 9 నుంచి 16 వరకు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇలా షెడ్యూల్‌ మారడం ఇది రెండో సారి. ముందు ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయని చెప్పిన అధికారులు ఆ తర్వాత 11 పేపర్లే ఉంటాయని ఉత్తర్వుల్లో జారీ చేశారు. తాజాగా ఇప్పుడు రెండు జిల్లాల పరీక్ష షెడ్యూల్‌ను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తుగా జిల్లా విద్యాధికారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడంవల్లనే ఈ విధమైన మార్పులు జరుగుతున్నట్లు విద్యా వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎస్‌ఏ-1కు మాత్రమే 11 పేపర్లు..
తెలంగాణలో నవంబర్‌ 1 నుంచి జరుగనున్న సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ-1) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను అక్టోబరు 12న పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం 9, 10వ తరగతి విద్యార్థులకు ఆరు పేపర్లు ఉంటాయని అందులో పేర్కొన్నారు. అయితే అప్పటికే కొన్ని జిల్లాల్లో ఆ జిల్లా విద్యాధికారుల ఆదేశాల మేరకు 11 పేపర్లకుగాను ప్రశ్నపత్రాలను ప్రింటింగ్‌ చేశారు. అయితే ఆరు పేపర్లే ఉంటాయని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొనడంతో కొత్తగా మళ్లీ ప్రశ్నపత్రాలను రూపొందించాల్సి ఉంటుంది.

దీంతో వెనక్కి తగ్గిన అధికారులు నవంబర్‌ 1 నుంచి జరిగే ఎస్‌ఏ-1కు మాత్రం 11 పేపర్లకు పరీక్షను నిర్వహించేలా, ఎస్‌ఏ-2, ఎస్‌ఎస్‌సీ వార్షిక పరీక్షలకు మాత్రం 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించేలా అక్టోబరు 19న మళ్లీ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల తీరు, అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో గందరగోళం ఏర్పడింది. మారిన షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు ఎస్‌ఏ-1 పరీక్షలను ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులు రాయనున్నారు. ఉదయం ఒక పేపర్‌, మధ్యాహ్నం మరో పేపర్‌కు పరీక్షలు నిర్వహించేలా అధికారులు షెడ్యూల్‌ను రూపొందించారు.

NCERT సూచనల వల్లే..
పదోతరగతి పరీక్ష విధానంపై సమీక్ష జరిపిన NCERT విద్యార్థులకు 11 రోజుల పాటు పరీక్షలు నిర్వహించడం వల్ల వారిపై ఒత్తిడి పెరుగుతోందని, వాటిని ఆరు పేపర్లకు కుదించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీందో ప్రభుత్వం కూడా 6 పేపర్ల విధానానికే మొగ్గు చూపింది. అయితే నవంబర్1 నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఎస్‌ఏ-1 పరీక్షలు జరగనున్నాయి. ఎస్‌ఏ-1 పరీక్షలను 11 పేపర్లతోనే నిర్వహించి, వార్షిక పరీక్షలు మాత్రం 6 పేపర్లతోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


:: READ ALSO ::

TS EAMCET: ఎంసెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి, ఇంకా 15,447 సీట్లు ఖాళీనే!!

తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సులకు తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. సీట్ల కేటాయింపు తర్వాత రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 15,447 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. తుది విడతలో కొత్తగా సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 28నాటికి కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
సీట్లకేటాయింపు, కళాశాలలవారీగా ఫీజుల వివరాల కోసం క్లిక్ చేయండి..

DOST Counselling: 'దోస్త్‌' స్పెషల్ కౌన్సెలింగ్, డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం!
ఇంజినీరింగ్‌లో సీట్లు పొందలేని వారి కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ స్పెషల్‌ డ్రైవ్‌ ఫేజ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అక్టోబరు 25 నుంచి అడ్మిషన్ల కౌన్సిలింగ్‌ ప్రారంభం కానుంది. డిగ్రీ కోర్సుల్లో మొత్తం 4 లక్షలకు పైగా సీట్లుండగా.. ఇప్పటి వరకు 1.5 లక్షల సీట్లు మాత్రమే నిండాయి. మిగిలిన సీట్లను ఈ విడతలో భర్తీచేయనున్నారు. ఇప్పటివరకు దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోని విద్యార్థులు రూ.400 చెల్లించి తమ పేరు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. 
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget