అన్వేషించండి
Advertisement
CBSE Single Girl Child Scholarship : సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ స్కీమ్.. దరఖాస్తు గడువు పెంపు
CBSE Single Girl Child Scholarship : సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ పథకం కింద కొత్త దరఖాస్తులు, రెన్యువల్స్ రెండూ అు్ డేట్ చేసిన గడువుకు లోబడి ఉంటాయి.
CBSE Single Girl Child Scholarship : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకారం CBSE మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును జనవరి 10, 2025 వరకు పొడిగించింది. సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ పథకం కింద కొత్త దరఖాస్తులు, రెన్యువల్స్ రెండూ అప్ డేట్ చేసిన గడువుకు లోబడి ఉంటాయి.
స్కాలర్‌షిప్ సంబంధించి పూర్తి వివరాలు:
నెలవారీ చెల్లింపు మొత్తం రూ.500.
అర్హత గల స్కీమ్స్:
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ X 2024: 2024లో 10వ తరగతి పూర్తి చేసి, ఇప్పుడు CBSE-అనుబంధ సంస్థలో 11వ తరగతిలో చేరిన ఒంటరి బాలికల కోసం ఈ స్కాలర్ షిప్ వస్తుంది.
సింగిల్ గర్ల్ చైల్డ్ అవార్డ్ X 2023 (రెన్యువల్ 2024): 2023లో అవార్డును పొందిన విద్యార్థుల నుండి దరఖాస్తులను రెన్యువల్ చేయవచ్చు.
అర్హత ప్రమాణాలు
- తల్లిదండ్రుల ఏకైక సంతానం అయిన ఒంటరి మహిళా యువతుల కోసం ఈ స్కాలర్‌షిప్ ను రూపొందించారు. దీనికి అర్హత పొందాలంటే, అభ్యర్థులు తప్పనిసరిగా CBSE 10వ తరగతి పరీక్షలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. ప్రస్తుతం CBSE- అనుబంధ పాఠశాలలో 11 లేదా 12వ తరగతిలో చేరి ఉండాలి.
- ఈ స్కాలర్‌షిప్ కింద 10వ తరగతికి నెలకు రూ.1,500 వరకు ట్యూషన్ ఫీజును కవర్ చేస్తుంది. 11, 12 తరగతులకు 10% వార్షిక పెరుగుదల ఉంటుంది. విదేశాలలో చదువుతున్న ఎన్ఆర్ఐ (NRI) విద్యార్థులకు, గరిష్ట ట్యూషన్ ఫీజు పరిమితి నెలకు రూ.6,000 గా ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్ అవకాశాన్ని పొందడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతీయ పౌరులు అయి ఉండాలి.
ముఖ్య విషయాలు
- దరఖాస్తుదారులు తప్పనిసరిగా పేరు, ఖాతా నంబర్, RTGS/NEFT, IFSC కోడ్, బ్యాంక్ చిరునామాతో సహా వారి బ్యాంక్ సమాచారాన్ని అందించాలి.
- ప్రతి దరఖాస్తు తప్పనిసరిగా ధృవీకరించబడాలి, సంతకం చేయాలి. సంతకం చేయని దరఖాస్తులు తిరస్కరిస్తారు.
- 11వ తరగతి మార్క్ షీట్ కాపీ ఉండాలి.
- ఆధార్ కార్డులు దరఖాస్తుదారుల బ్యాంకు ఖాతాలకు అనుసంధానించి ఉండాలి.
- బ్యాంక్ పాస్‌బుక్ ధృవీకరించిన కాపీ లేదా రద్దు చేసిన చెక్కు ఉండాలి.
- ఎలా దరఖాస్తు చేయాలంటే..
- సీబీఎస్ఐ అధికారిక వెబ్‌సైట్ cbse.nic.in ని సందర్శించండి.
- హోమ్‌పేజీలో, 'సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ X-2024 REG(Single Girl Child Scholarship X-2024 REG)'ని క్లిక్ చేసి, ఆపై అప్లికేషన్ లింక్‌ని ఫాలో అవ్వండి.
- కొత్త దరఖాస్తును సమర్పించాలా లేదా ఇప్పటికే ఉన్నదాన్ని పునరుద్ధరించాలా అన్న దాన్ని ఇక్కడ ఎంచుకోండి.
- అప్లికేషన్ ఫారమ్‌ను పూరించండి. సంబంధిత పేపర్‌లను అప్‌లోడ్ చేసి, దరఖాస్తును సమర్పించండి.
- భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
రాజమండ్రి
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion