News
News
X

BRAOU Tution Fee: సార్వత్రిక డిగ్రీ, పీజీ ఫీజు చెల్లింపునకు మరో అవకాశం, చివరితేది ఎప్పుడంటే?

డిగ్రీ రెండో, మూడో సంవత్సరం, పీజీ రెండో సంవత్సరానికి సంబంధించి సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించని విద్యార్థులు ఫిబ్రవరి 6లోగా చెల్లించాలి తెలిపారు.

FOLLOW US: 
Share:

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ ట్యూషన్ రుసుం చెల్లింపునకు ఆలస్య రుసుంతో అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు జనవరి 25న ఒక ప్రకటనలో తెలిపాయి. డిగ్రీ రెండో, మూడో సంవత్సరం, పీజీ రెండో సంవత్సరానికి సంబంధించి సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించని విద్యార్థులు ఫిబ్రవరి 6లోగా చెల్లించాలి తెలిపారు.

మరోవైపు పీజీ సప్లిమెంటరీ పరీక్షలు జనవరి 27 నుంచి ప్రారంభంకానున్నాయి. జనవరి 31 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోలేని అభ్యర్థులు వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలి.

మార్కెట్‌లోకి అంబేద్కర్‌ వ‌ర్సిటీ స్టడీ మెటీరియల్‌! ధర ఎంతంటే?
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ యువత కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏవోయూ) నాలుగు పుస్తకాలతో కూడిన స్టడీ మెటీరియల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకాలకు అభ్యర్థుల నుంచి మంచి స్పందన వస్తోంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం తీసుకొచ్చిన ఈ మెటీరియల్‌ను ఆవిష్కరించిన రెండురోజుల్లోనే బుకింగ్స్​‍ మొదలయ్యాయి. వర్సిటీ అధికారులు నాలుగు పుస్తకాల ధరను రూ. 1,150గా నిర్ణయించారు. మొత్తం 2,200 పేజీలు ఉన్న ఈ మెటీరియల్‌ను జిరాక్స్​​‍ తీస్తే రూ.2వేలకు పైగా ఖర్చవుతుంది. కానీ వర్సిటీ అధికారులు అతి తక్కువకే స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తెచ్చారు. తొలివిడతగా 20వేల పుస్తకాలను ముద్రించారు. వీటిలో కొన్ని గ్రంథాలయాలకు అందించగా, మరికొన్నింటిని వర్సిటీలోనే విక్రయిస్తున్నారు.

బీఏ, ఎంఏ పుస్తకాలకు ఎక్కువ డిమాండ్‌ నెలకొన్నది. వీటిని మార్కెట్లో విక్రయించరు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు మాత్రమే అందజేస్తారు. ఈ పుస్తకాలు సివిల్స్​‍కు పోటీపడే అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పూర్వ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి మెటీరియల్‌ రూపకల్పన కమిటీ చైర్మన్‌గా ఉండి అన్ని అంశాలను క్రోడీకరించి, పుస్తకాలను తయారుచేయించారు.

పుస్తకాలు ఇవే..

1) తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవతరణ

2) ఆర్థిక వ్యవస్థ -అభివృద్ధి

3) భారత సమాజం – రాజ్యాంగ పరిపాలన

4)  భారతదేశ చరిత్ర – సంస్కృతి

ఇలా బుక్ చేసుకోండి..
1. మెటీరియల్‌ కావాలనుకొనే అభ్యర్థులు మొదట www.braouonline.inలో పేమెంట్‌ చేయాలి.

2. ఆ తర్వాత వచ్చిన పేమెంట్‌ రశీదుతో వర్సిటీకి వెళ్లి మెటీరియల్‌ పొందవచ్చు.

3. పోస్టు ద్వారా పొందాలనుకొనేవారు https://www.braouonline.in/BooksSale/ServicesBooks.aspx లింక్ ద్వారా సంప్రదించాలి.

4. వర్సిటీ కౌంటర్‌లోనూ డబ్బులు చెల్లించి వెంటనే మెటీరియల్‌ పొందవచ్చు.

5. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకొంటే, పోస్టు ద్వారా ఇంటికి పంపిస్తామని వర్సిటీ అధికారులు వెల్లడించారు.

తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వహించే పోటీ ప‌రీక్షల‌కు ఉప‌యోగ‌ప‌డే పుస్తకాల‌ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకాల‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ఐటీ-ప‌రిశ్రమ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ ఆగస్టు 27న విడుద‌ల చేశారు. మొత్తం నాలుగు రకాల పుస్తకాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 125 మంది ప్రొఫెసర్లు ఈ పుస్తకాలను రూపొందించడంలో అహర్నిశలు పనిచేశారు. 

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి పోటీ పరీక్షల పుస్తకాలు వెలువడటం గురించి ప్రొఫెసర్ గంటా చక్రపాణి స్పందించారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రూపొందించిన పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను రాష్ట్రమంత్రి కేటీఆర్ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. టీఎస్‌పీఎస్సీ సిలబస్‌కు అనుగుణంగా పుస్తకాలను రూపొందించారని తెలిపారు. 

Also Read:

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం, వచ్చే ఏడాది నుంచి కొత్త 'గ్రూపు' అందుబాటులోకి!
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్తగా మరో గ్రూపు అందుబాటులోకి రానుంది. అకౌంట్స్ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ ఈ గ్రూపును వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అకౌంటెన్సీతో పాటు కామర్స్, ఆర్థికశాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉండనున్నాయి. సీఈఏ గ్రూపుగా పిలవనున్నారు. ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలుగా సీఈఏ గ్రూపును రూపొందించారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 26 Jan 2023 02:40 PM (IST) Tags: Education News in Telugu BRAOU Tution Fee Ambedkar Open University Tution Fee Braou PG Tution Fee Braou UG Tution Fee

సంబంధిత కథనాలు

JAM 2023 Results: ఐఐటీ జామ్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

JAM 2023 Results: ఐఐటీ జామ్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!

GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!

CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!

CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!

APOSS SSC Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APOSS SSC Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!