BEd Notification: దూరవిద్య బీఈడీ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిగ్రీతోపాటు ఇంజినీరింగ్ చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సాధారణ డిగ్రీతోపాటు ఇంజినీరింగ్ డిగ్రీ చదివిన వారు కూడా దరఖాస్తుకు అర్హులు. అయితే ఇంజినీరింగ్‌లో సైన్స్/ మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 21 నుంచి మే 20 వరకు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే రూ.500 ఆలస్య రుసుముతో మే 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.750 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులు జూన్ 2 నుంచి ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 6న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
వివరాలు..
* దూరవిద్య బీఈడీ ప్రవేశాలు - 2023
1) బీఈడీ
అర్హత: 50 శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ/బీకామ్/బీసీఏ/బీఎస్సీ(హోంసైన్స్)/బీబీఎం/బీబీఏ/బీఈ/బీటెక్ అర్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. డిగ్రీతో నిర్ణీత మార్కులు లేని అభ్యర్థులకు పీజీ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జనరల్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 25 మార్కులు, తెలుగు ప్రొఫీషియన్సీ 25 మార్కులు, జనరల్ మెంటల్ ఎబిలిటీకి 50 మార్కులు కేటాయించారు.
2) బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)
అర్హత: 50 శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ/బీకామ్/బీసీఏ/బీఎస్సీ(హోంసైన్స్)/బీబీఎం/బీబీఏ/బీఈ/బీటెక్ అర్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
కోర్సు వ్యవధి: రెండున్నర సంవత్సరాలు (5 సెమిస్టర్లు)
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పేపరును రెండు భాగాలుగా(పార్ట్-ఎ, పార్ట్-బి) విభజిస్తారు. వీటిలో పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 40 మార్కులు, పార్ట్-బి: జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ & అనలిటికల్ రీజనింగ్ (వెర్బల్ & అబ్‌స్ట్రాక్ట్ రీజనింగ్) 60 మార్కులు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.750 చెల్లించాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు...
➪ నోటిఫికేషన్ వెల్లడి: 21.04.2023
➪ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.04.2023
➪ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 22.05.2023
➪ రూ.500 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 28.05.2023
➪ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 02.06.2023
➪ ప్రవేశ పరీక్ష తేది (బీఈడీ): 06.06.2023 (10.30 AM - 12.30 PM)
➪ ప్రవేశ పరీక్ష తేది (బీఈడీ-స్పెషల్ ఎడ్యుకేషన్): 06.06.2023 (02.30 PM - 04.00 PM)
Also Read:
డీఈఈసెట్-2023 నోటిఫికేషన్ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!
తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్-2023' (డీఎడ్) నోటిఫికేషన్ ఏప్రిల్ 21న విడుదలైంది. రెండేళ్ల కాలపరిమతితో ఉండే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించి ఏప్రిల్ 22 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏడీసెట్-2023' నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
కడపలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ & ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వివిధ ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 'ఆర్ట్ & డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏడీసెట్)-2023' నోటిఫికేషన్‌ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్‌ఏ), బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడిజైన్ ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాాగా.. మే 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..