AP SSC Exams: పదోతరగతి విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు అవకాశం - త్వరలో పాఠశాలలకు మోడల్ పేపర్లు
SSC: ఏపీలో పదోతరగతి విద్యార్థుల వివరాల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. డిసెంబరు 23 వరకు అవకాశం ఉంది. పుట్టిన తేదీ, పేర్లు, మాధ్యమం వంటి వాటిలో మార్పులు అవసరమైతే వెంటనే చేయాలి.
AP 10th Class Details Corrections: ఆంధ్రప్రదేశ్‌లోని పదోతరగతి విద్యార్థులకు ప్రభుత్వం కీలక సూచనచేసింది. విద్యార్థుల వివరాల ఆన్‌లైన్ నమోదులో ఏమైనా తప్పులు ఉంటే సరి చేయాలి. పుట్టిన తేదీ, పేర్లు, మాధ్యమం వంటి వాటిలో మార్పులు అవసరమైతే వెంటనే చేయాలి. గతంలో అనుత్తీర్ణులైన వారికి ప్రైవేటు విద్యార్థులుగా ఫీజు చెల్లించాలి. సార్వత్రిక విద్యా పీఠం విద్యార్థులకు సైతం రెగ్యులర్ విద్యార్థులతో పరీక్షలు నిర్వహించాలి. ఇందుకోసం అయా ప్రాంతాల్లో సార్వత్రిక విద్యా పీఠం విద్యార్థుల వివరాలు తీసుకొని, ప్రత్యేకంగా పరీక్ష కేంద్రాలను కేటాయించాలని సూచించారు.
త్వరలో మోడల్ పేపర్లు..
పదోతరగతి పరీక్షల మోడల్ పేపర్లు పంపనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం (డిసెంబరు 20) ఆయన డీఈఓలు, ఆర్జేడీలతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ప్రశ్నలు, బిట్ల బ్యాంకును స్కూళ్లకు పంపిస్తామని వెల్లడించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాటిని విద్యార్థులకు అందజేయాలని ఆదేశించారు.
పదోతరగతి పరీక్షల షెడ్యూలు..
ఏపీ ప్రభుత్వం పదోతరగతి పరీక్షల షెడ్యూలును విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మంత్రి లోకేశ్ పరీక్షల షెడ్యూలును డిసెంబరు 18న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఒత్తిడికి లోను కాకుండా ఉండేందుకు రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. పరీక్షకు పరీక్షకు మధ్య విరామం ఉన్నందున.. విద్యార్థులు టెన్షన్ లేకుండా పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని టెన్త్ బోర్డ్ ఎగ్జామ్‌కు హాజరు కానున్న విద్యార్థులకు మంత్రి సూచించారు.
➥ 17-03-2025 (సోమవారం) - ఫస్ట్ ల్యాంగ్వేజ్ గ్రూప్ ఏ - 9.30 నుంచి 12.45 వరకు
➥ 17-03-2025 (సోమవారం) - ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 కాంపోజిట్ కోర్స్ - 9.30 నుంచి 12.45 వరకు
➥ 19-03-2025 (బుధవారం) - సెకండ్ ల్యాంగ్వేజ్ - 9.30 నుంచి 12.45 వరకు
➥ 21-03-2025 (శుక్రవారం) - ఇంగ్లీష్ - 9.30 నుంచి 12.45 వరకు
➥ 22-03-2025 (శనివారం) - ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 కాంపోజిట్ కోర్స్ - 9.30 నుంచి 11.15 వరకు
➥ 22-03-2025 (శనివారం) - OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) - 9.30 నుంచి 12.45 వరకు
➥ 24-03-2025 (సోమవారం) - మ్యాథమేటిక్స్ - 9.30 నుంచి 12.45 వరకు
➥ 26-03-2025 (బుధవారం) - భౌతికశాస్త్రం - 9.30 నుంచి 12.45 వరకు
➥ 28-03-2025 (శుక్రవారం) - జీవశాస్త్రం - 9.30 నుంచి 12.45 వరకు
➥ 29-03-2025 (శనివారం) - OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) - 9.30 నుంచి 12.45 వరకు
➥ 29-03-2025 (శనివారం) - SSC ఒకేషనల్ కోర్స్ (థియరీ)- 9.30 నుంచి 11.30 వరకు
➥ 31-03-2025 (సోమవారం) - సాంఘీక శాస్త్రం - 9.30 నుంచి 12.45 వరకు
ALSO READ: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!