అన్వేషించండి

RGUKT: నేటి నుంచి ఆర్జీయూకేటీ కౌన్సెలింగ్, ఈ సర్టిఫికేట్లు ఉన్నాయా?

బాసర ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థులకు శుక్రవారం (జులై 7) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జులై 9 వరకు వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు విద్యాలయ డైరెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు.

బాసర ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థులకు శుక్రవారం (జులై 7) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జులై 9 వరకు వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు విద్యాలయ డైరెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. జులై 6న విద్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బాసర ఆర్జీయూకేటీలోని 1404 సీట్లకు శుక్రవారం 500 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. 

బాస‌ర ఆర్జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాల‌కు సంబంధించి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా జులై 3న విడుద‌లైన సంగతి తెలిసిందే. తొలిదశలో మొత్తం 1404 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీకిలో ఓపెన్ కేట‌గిరిలో 640 మంది విద్యార్థులు, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరిలో 118 మంది, బీసీ కేట‌గిరిలో 346 మంది, ఎస్సీ కేట‌గిరిలో 178 మంది, ఎస్‌టీ కేట‌గిరిలో 119 మంది విద్యార్థులు ఎంపిక‌య్యారు.

తొలి జాబితాలో సీట్లు పొందిన విద్యార్థుల‌కు జులై 7 నుంచి 9 వ‌ర‌కు కౌన్సెలింగ్ నిర్వహించ‌నున్నారు. జాబితాలో 1వ నెంబరు నుంచి 500 వ‌ర‌కు జులై 7న, 501 నుంచి 1000 వ‌ర‌కు జులై 8న, 1001 నుంచి 1404 వ‌రకు జులై 9న కౌన్సెలింగ్ నిర్వహించ‌నున్నారు. అలాగే దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు జులై 14న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఇక ఎన్‌సీసీ, క్యాప్ విభాగాలకు చెందినవారికి జులై 15న సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు యూనివ‌ర్సిటీ అధికారులు వెల్లడించారు. 

ఎంపిక జాబితా కోసం క్లిక్ చేయండి..

Call Letter for Counseling

కౌన్సెలింగ్‌కు ఈ డాక్యుమెంట్లు అవసరం..

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. రెండు సెట్ల జిరాక్స్ కాపీలతోపాటు, ఒరిజినల్ సర్టిఫికేట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

1) పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్

2) పదోతరగతి మార్కుల జాబితా (గ్రేడ్-షీట్)

3) 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ/బోనఫైడ్ సర్టిఫికేట్లు.

4) రెసిడెన్స్ సర్టిఫికేట్

5) క్యాస్ట్/కమ్యూనిటీ/ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్.

6) ఇన్‌కమ్ సర్టిఫికేట్ (01.04.2023 తర్వాత జారీచేసినది).

7) విద్యార్థి ఫోటోలు-6, రెండు తల్లిదండ్రుల ఫోటోలతోపాటు, ఇద్దరు గార్డియన్‌ల ఫోటోలు ఉండాలి. 

8) ఫ్యామిలీ రేషన్ కార్డు కాపీ. 

9) ఆధార్ కార్డు. 

10) చదువు కోసం బ్యాంకు రుణం కోరేవారు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు క్యాంపస్‌లో బ్యాంకులో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుతోపాటు కింది డాక్యుమెంట్లు అవసరమవుతాయి.

➥ 4 సెట్ల సర్టిఫికేటల్ కాపీలు 

➥ తల్లిదండ్రులు ఉద్యోగులైతే ఎంప్లాయి ఐడీ కార్డు కాపీ. 

➥ గడచిన 3 నెలల శాలరీ సర్టిఫికేట్లు (పే స్లిప్స్) 

➥ విద్యార్థి, తల్లిదండ్రుల పాన్‌కార్డు

➥ రేషన్ కార్డు/పాన్‌కార్డు/ఓటరు ఐడీకార్డు/ఆధార్ కార్డు (విద్యార్థి, తల్లిదండ్రుల)

➥ చివరి 6 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్.

➥ విద్యార్థి ఫోటోలు-6, రెండు తల్లిదండ్రుల ఫోటోలు నాలుగు అవసరమవుతాయి.

ALSO READ:

ఈ స్కిల్స్ ఉంటే చదువుతూ రెండు చేతులా సంపాదించొచ్చు!
Popular Earning Tips: పాకెట్ మనీ.. చాలా మంది స్టూడెంట్స్ కు అదో భరోసా. చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి పాకెట్ మనీ ఉండాల్సిందే. ఫ్రెండ్స్ తో కలిసి చాయ్ తాగాలన్నా, అలా బైక్ పై షికారుకు వెళ్లాలన్నా, కలిసి బిర్యానీ తిన్నాలన్నా.. బీర్ తాగాలన్నా పాకెట్ మనీ కంపల్సరీ. పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీ చాలా మంది యువతకు ఏమాత్రం సరిపోదు. కాలేజీ ఫీజులు, పరీక్ష ఫీజులు, బుక్కులు, పెన్నులు, రికార్డులు, ఎక్విప్‌మెంట్లు, ల్యాప్‌టాప్‌లు అబ్బో.. ఈ లిస్టు చాలా పెద్దదే. వాటన్నింటికి పేరెంట్స్ వద్ద డబ్బులు తీసుకుని, పాకెట్ మనీ కూడా తీసుకుని ఇంకా కావాలని అడగాలంటే చాలా మందికి అదోలా ఉంటుంది. అలాంటి స్టూడెంట్లు చదువుకుంటూనే చిన్న చిన్న పనులు చేస్తూ తమ అవసరాలకు కావాల్సినంత సంపాదించుకునేందుకు చాలానే మార్గాలు ఉన్నాయి. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul with Thati Munjalu | ఓట్లతో కుండలు నింపాలంటున్న కేఏ పాల్ | ABP DesamKTR On Krishank Arrest |క్రిశాంక్ తో ములాఖత్ ఐన కేటీఆర్ | ABP DesamParakala Prabhakar Exclusive Interview | మోదీ సర్కార్ చెప్పే దొంగ లెక్కలు ఇవే..! | ABP DesamVelichala Rajender Rao | Karimnagar | వినోద్ కుమార్, బండి సంజయ్‌లతో ప్రజలు విసిగిపోయారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Swathi Reddy: ‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
Meenakshi Chaudhary Latest Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
KTR: కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
Embed widget