Commerce Group Courses: కామర్స్ గ్రూప్ వారికి ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న మంచి కోర్సులు ఇవే!
Commerce Group: ఒకప్పుడు కామర్స్ అంటే సీఏ, సీయెస్ వంటి కోర్సులు మాత్రమే వినపడేవి. ఇప్పుడు బీకాం, బీబీఏ వంటి కోర్సులు కూడా ముందుంటున్నాయి.
Commerce Group Courses: ఒకప్పుడు కామర్స్ అంటే సీఏ, సీయెస్ వంటి కోర్సులు మాత్రమే వినపడేవి. ఇప్పుడు బీకాం, బీబీఏ వంటి కోర్సులు కూడా ముందుంటున్నాయి. ఆర్థిక, విజ్ఞాన రంగాలు ఎంతో పురోభివృద్ధి సాధిస్తున్న తరుణంలో కామర్స్ కోర్సుల ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈ కోర్సుల్లో చేరిన వారికి ఉద్యోగ అవకాశాలూ ఎక్కువే ఉంటున్నాయి.
బీబీఏ
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అత్యంత ప్రాముఖ్యం ఉన్న కోర్సు బీబీఏ. ఇది మూడు సంవత్సరాల కోర్సు. ఈ కోర్సులో హెచ్ ఆర్, మార్కెటింగ్, హాస్పిటల్ మానేజ్మెంట్ వంటి ఇంట్రెస్టింగ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. బీబీఏ లో చేరిన వారు లోతైన ఆర్గనైజేషనల్ స్కిల్స్ నేర్చుకుంటారు. కాబట్టి ఈ స్కిల్స్ కు తగినట్టుగా ఉపాధి అవకాశాలూ చాలానే ఉంటాయి. బీబీఏ పూర్తిచేసినవారికి బ్యాకింగ్, ఫైనాన్స్, ఇన్స్యూరెన్స్ రంగాలతో పాటూ సాఫ్ట్వేర్ సంస్థలూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి.
బీకామ్
ఇంటర్ లో ఏ గ్రూప్ చదివిన వారైనా బీకామ్ లో చేరవచ్చు. అందుకనే ఈ గ్రూపుకు ప్రాముఖ్యం ఎక్కువ. బీకామ్ చదివిన వారు ఎక్కువగా ఎంబీఏ చేస్తుంటారు. విదేశాల్లో ఈ కోర్సు చేసేవారూ ఎక్కువే. బీకామ్ తో పాటూ స్టాక్ మార్కెట్ పై పట్టు సాధించి ఏదైనా సర్టిఫికేషన్ కోర్సు చేస్తే భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. బీకామ్ లో కంప్యూటర్స్, ట్యాక్సేషన్, ఫారిన్ గ్రేడ్ వంటి స్పెషలైజేషన్స్ ఎంచుకోవచ్చు.
బీకామ్ ఎల్ ఎల్ బీ
అభివృద్ధి చెందుతున్న ఆధునిక వ్యవస్థలో ఒకటి కంటే ఎక్కువ రంగాల్లో నైపుణ్యం అవసరం. అలా రెండు లేదా అంతకంటే ఎక్కువ కోర్సులను ఒకే కోర్సులో అంతర్భాగం చేసి ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లా తీసుకువస్తున్న విద్యాసంస్థలు ఎన్నో ఉన్నాయి. ఇటు వ్యాపార, అటు న్యాయశాస్త్రంలో నైపుణ్యం సంపాదించటం వారి కెరియర్ కు అవసరం అనుకున్న వారికి బీకామ్ ఎల్ ఎల్ బీ ఇంటిగ్రేటెడ్ కోర్సు అందుబాటులో ఉంది. ఇలా చేయటం వల్ల కేవలం 5 సంవత్సరాలలోనే 2 డిగ్రీ పట్టాలు సంపాదించవచ్చు. దీనికి తోడు న్యాయశాస్త్రంలో బిజినెస్ లా, కార్పొరెట్ లా, ఇంటిగ్రేటెడ్ లా వంటి నచ్చిన స్పెషలైజేషన్ ఎంచుకునే సౌలభ్యం ఉంది.
బీఏ ఎకనామిక్స్ ఆనర్స్
ఎకనామిక్స్ చదివినవారిని ఫారిన్ కంట్రీస్ ఆకర్షిస్తున్నాయి. అక్కడి యూనివర్సిటీలు పీజీ కోర్సులను ఆఫర్ చేయటమే కాకుండా, ఉద్యోగ అవకాశాలూ కల్పిస్తున్నాయి. బీఏ ఎకనామిక్స్ లో సబ్జెక్ట్ కొంతవరకే నేర్చుకుంటారు కానీ బీఏ ఎకనామిక్స్ ఆనర్స్ చేసిన వారికి వ్యాపార రంగంలో స్థిరపడేంత నైపుణ్యత సాధిస్తారు. కార్పొరేట్ కంపెనీల్లో ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ బ్యాంకులు, ఆర్బీఐ లో ఉద్యోగాలు కూడా సంపాదించవచ్చు.
బీబీఏ ఎల్ ఎల్ బీ
బీకామ్ ఎల్ ఎల్ బీ లాగానే బీబీఏ కూడా చాలా మంచి ఇంటిగ్రేటెడ్ కోర్సు. ఇందులో చేరటానికి క్లాట్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఈ ఐదు సంవత్సరాల లా కోర్సు పూర్తి చేసిన తర్వాత కార్పొరేట్ లాయర్ గా, లీగల్ అడ్వైజర్ గా స్థిరపడవచ్చు లేదా మేనేజ్మెంట్ స్టడీస్లో స్పెషలైజేషన్ తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించవచ్చు.