News
News
వీడియోలు ఆటలు
X

AP LAWCET: ఏపీ లాసెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

ఏపీ లాసెట్‌-2023 హాల్‌టికెట్లను ఏపీ ఉన్నతవిద్యామండలి మే 15న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20న పరీక్ష నిర్వహించనున్నారు.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఏపీ లాసెట్‌-2023 హాల్‌టికెట్లను ఏపీ ఉన్నతవిద్యామండలి మే 15న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. లాసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా మొబైల్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30 వరకు లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 

లాసెట్ హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

➥ ఏపీ లాసెట్ హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోలా వెళ్లాలి- https://cets.apsche.ap.gov.in/

➥ అక్కడ హోంపేజీలో 'Download Hall Tickets' లింక్ మీద క్లిక్ చేయాలి.

➥ క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా మొబైల్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'Download Hall Ticket' పై సబ్‌మిట్ చేయాలి.

➥ లాసెట్ హాల్‌టికెట్ కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోని ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపర్చుకోవాలి.

హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

వివరాలు...

* ఏపీలాసెట్/ పీజీఎల్‌సెట్ - 2023

కోర్సుల వివరాలు..

1) మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు 

- ఎల్‌ఎల్‌బీ 

- ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)

అర్హత: 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

2) ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు 

- బీఏ ఎల్‌ఎల్‌బీ

- బీకామ్ ఎల్‌ఎల్‌బీ

- బీబీఏ ఎల్‌ఎల్‌బీ

అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

3) రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు

అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

లాసెట్ పరీక్ష విధానం: మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. వీటిలో పార్ట్-ఎ: జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ 30 ప్రశ్నలు-30 మార్కులు, పార్ట్-బి: కరెంట్ ఎఫైర్స్ 30 ప్రశ్నలు-30 మార్కులు, పార్ట్-సి: ఆప్టిట్యూడ్ (స్టడీ ఆఫ్ లా) 60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పార్ట్-సిలో బేసిక్ లా ప్రిన్సిపుల్స్, భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.  తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. ఐదేళ్ల లా కోర్సు పరీక్ష రాసేవారికి ఇంటర్ స్థాయిలో, మూడేళ్ల లా కోర్సు పరీక్ష రాసేవారికి డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. అభ్యర్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో కనీసం అర్హత మార్కులను 35 శాతం అంటే 42 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు. పరీక్ష సమయం 90 నిమిషాలు.

పీజీఎల్‌సెట్ పరీక్ష విధానం: మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. పరీక్షలో మొత్తం 2 సెక్షన్లు (పార్ట్-ఎ, పార్ట్-బి) ఉంటాయి. ఇందులో పార్ట్-ఎ నుంచి 40 పశ్నలు, పార్ట్-బి నుంచి 80 పశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే పరీక్ష ఉంటుంది. పరీక్షలో అర్హత మార్కులను 25 శాతంగా (30 మార్కులు) నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి కనీస మార్కులు లేవు. 

ముఖ్యమైన తేదీలు...

* నోటిఫికేషన్ వెల్లడి: 22.03.2023.

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.03.2023

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.04.2023

* రూ.500 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 29.04.2023

* రూ.1000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 05.05.2023

* రూ.2000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 09.05.2023

* దరఖాస్తుల సవరణకు అవకాశం: 10.05.2023 & 11.05.2023.

* హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 15.05.2023 నుంచి.

* పీజీఈసెట్ పరీక్ష తేది: 20.05.2023 వరకు.

పరీక్ష సమయం: మ. 03.00 గం. . సా. 4.30 గం. వరకు.

Notification 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Published at : 15 May 2023 09:05 PM (IST) Tags: AP LAWCET 2023 Exam Date APLAWCET/APPGLCET 2023 Exam Schedule APLAWCET 2023 Hall Tickets APLAWCET 2023 Exam Hall Tickets APLAWCET 2023 Halltickets

సంబంధిత కథనాలు

గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TS Inter Exams: ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

TS Inter Exams: ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

JoSAA 2023 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!

JoSAA 2023 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్