X

AP Schools Reopen Date: ఈ నెల 16 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభం.. సాధారణ టైమింగ్స్‌లోనే..

ఏపీలో ఈ నెల 16వ తేదీ నుంచి పాఠశాలలను రీఓపెన్ చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి వెల్లడించారు. సాధారణ పనివేళల్లోనే స్కూళ్లను నడిపిస్తామని చెప్పారు.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో బడి గంటలు మోగనున్నాయి. ఏపీలో ఈ నెల 16వ తేదీ నుంచి పాఠశాలలను రీఓపెన్ చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి వెల్లడించారు. కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే పాఠశాలలను తెరవనున్నట్లు తెలిపారు. కోవిడ్‌కు ముందు ఉన్నట్లుగానే సాధారణ పనివేళల్లోనే స్కూళ్లను నడిపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి అయిందని.. మిగతా వారికి కూడా టీకాలు వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ క్లాసులు జరగడం లేదని స్పష్టం చేశారు. 

16 నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు..
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు ఇంటర్ బోర్డు బోర్డు సెక్రటరీ రామకృష్ణ వెల్లడించారు. తరగతుల ఏర్పాట్లకు తగిన చర్యలు తీసుకోవాలని కాలేజీల యాజమాన్యాలకు సూచించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read More: AP Inter 2nd year Class: ఏపీలో 16 నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు..

తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్ ఎప్పుడు?
తెలంగాణలో కూడా స్కూళ్లు తెరవడంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశానికి ముందు రోజు దీనికి సంబంధించి నివేదికను సమర్పించామని, కానీ ఆ విషయం కేబినెట్‌లో చర్చించలేదని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీ తర్వాత స్కూళ్లను దశల వారీగా ప్రారంభించాలని తాము సూచించామని చెప్పారు. 

Also read: AP Inter College Reopen: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కరోనా నిబంధలు వచ్చేశాయి... ఈ రూల్స్ పాటించకుంటే సమస్యలు తప్పవు

కోవిడ్ మహమ్మారి వల్ల పిల్లల చదువులన్నీ గందరగోళంలో పడ్డాయి. కోవిడ్ సెకండ్ వేవ్‌కు ముందు స్కూళ్లు తెరిచినప్పటికీ కేసులు పెరిగిపోవడంతో స్కూళ్లను మూసేయాల్సి వచ్చింది. ఇప్పుడు సెకండ్ వేవ్‌లో కేసులు తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ స్కూళ్లు తెరవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

Read More: School Reopen: తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్ ఎప్పుడు? విద్యాశాఖ ఏం చెప్పిందంటే.. మరి సర్కార్ ఒప్పుకుంటుందా?

Also Read: TS CPGET 2021: ఒకే పరీక్షతో ఏడు వర్సిటీల్లో ప్రవేశాలు.. సీపీజీఈటీ నోటిఫికేషన్‌ విడుదల.. అప్లై చేసేటప్పుడు వీటిని మర్చిపోవద్దు

Tags: AP Schools Reopen Date AP schools Reopen AP schools From august 16

సంబంధిత కథనాలు

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

NEET-PG 2022: నీట్‌ పీజీ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ స్టార్ట్‌.. త్వరగా అప్లై చేయకుంటే జరిగే నష్టం తెలుసా!

NEET-PG 2022: నీట్‌ పీజీ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ స్టార్ట్‌.. త్వరగా అప్లై చేయకుంటే జరిగే నష్టం తెలుసా!

Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం

Army Public School Recruitment 2022: ఆర్మీ స్కూల్స్‌లో టీచర్ ఉద్యోగాలు.. 57ఏళ్ల వయసు వాళ్లు అప్లై చేసుకోవచ్చు..

Army Public School Recruitment 2022: ఆర్మీ స్కూల్స్‌లో టీచర్ ఉద్యోగాలు.. 57ఏళ్ల వయసు వాళ్లు అప్లై చేసుకోవచ్చు..

టాప్ స్టోరీస్

Pooja Hegde New House: సొంతింటి కోసం పూజా హెగ్డే అలా ప్లాన్ చేశారు! ఇంకా ఆమె తల్లి చేసిన సాయం ఏంటంటే...

Pooja Hegde New House: సొంతింటి కోసం పూజా హెగ్డే అలా ప్లాన్ చేశారు! ఇంకా ఆమె తల్లి చేసిన సాయం ఏంటంటే...

Heart Problems: గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే... ఈ చిట్కాలు పాటించాల్సిందే

Heart Problems: గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే... ఈ చిట్కాలు పాటించాల్సిందే

Jagityala Crime: మంత్రాలకు ప్రాణాలు పోయాయి... చేతబడి అనుమానంతో కాలనీవాసులే దారుణం... జగిత్యాల హత్యల కేసులో కీలక విషయాలు

Jagityala Crime: మంత్రాలకు ప్రాణాలు పోయాయి... చేతబడి అనుమానంతో కాలనీవాసులే దారుణం... జగిత్యాల హత్యల కేసులో కీలక విషయాలు

Corona virus: ఒమిక్రాన్ వేరియంట్ కొత్త లక్షణం... చెవి లోపలి భాగంపై వైరస్ ప్రభావం, చెవినొప్పి వస్తే టెస్టు చేయించుకోవాల్సిందే

Corona virus: ఒమిక్రాన్ వేరియంట్ కొత్త లక్షణం... చెవి లోపలి భాగంపై  వైరస్ ప్రభావం, చెవినొప్పి వస్తే టెస్టు చేయించుకోవాల్సిందే