AP RGUKT Result: ఏపీ ట్రిపుల్‌ఐటీ ఫేజ్-3 ఎంపిక జాబితా విడుదల, కౌన్సెలింగ్ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి మూడో విడత (ఫేజ్-3) అభ్యర్థుల జాబితాను ఆగస్టు 19న అధికారులు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి మూడో విడత (ఫేజ్-3) అభ్యర్థుల జాబితాను ఆగస్టు 19న అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల వివరాలను అందుబాటులో ఉంచారు. మొత్తం 1240 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. అందుబాటులో ఉన్న సీట్లను విద్యార్థుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేస్తారు.
క్యాంపస్‌ల మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అదేవిధంగా ఫేజ్-3 కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు కాల్ లెటర్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. మొదటి దఫాలో 38,355 మంది దరఖాస్తు చేశారు. నాలుగు క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆగస్టు 23, 27 తేదీల్లో నూజివీడు ట్రిపుల్‌ఐటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అనంతరం తరగతులు ప్రారంభం కానున్నాయి.
విద్యార్థుల ఎంపిక జాబితాల కోసం క్లిక్ చేయండి..
క్యాంపస్ మార్పుకోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితా కోసం క్లిక్ చేయండి..
కాల్ లెటర్ కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
పేద బాలికల చదువుకు ఇన్ఫోసిస్ చేయూత, 'స్టెమ్ స్టార్స్' స్కాలర్‌షిప్ ద్వారా రూ.100 కోట్ల సాయం
దేశంలో బలహీన వర్గాలకు చెందిన బాలికల విద్య కోసం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా బాలికలకు ఉపకారవేతనాలను అందించనుంది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టెమ్ స్టార్స్ (STEM Stars) పేరుతో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. ఈ స్కాలర్‌షిప్‌ల ద్వారా బాలికల చదువుకు ఆర్థిక సాయం అందుతుందని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలిపింది. ‘ఆడపిల్లల చదువు వారి పిల్లల జీవితంపై ప్రభావం చూపుతుంది. అందుకే మేం 'స్టెమ్ స్టార్స్' స్కాలర్‌షిప్‌ను తీసుకొచ్చినట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్పష్టం చేసింది. బాలికల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అవసరమైన ట్యూషన్ ఫీజు, వసతి ఖర్చులు, స్టడీ మెటీరియల్ ఇలా.. అన్నింటికీ కలిపి ఏడాదికి లక్ష రూపాయలు.. నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయాన్ని అందిస్తామని వెల్లడించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్-2023 నోటిఫికేషన్, పరీక్ష ఎప్పుడంటే?
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది. ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..