Infosys STEM Stars: పేద బాలికల చదువుకు ఇన్ఫోసిస్ చేయూత, 'స్టెమ్ స్టార్స్' స్కాలర్‌షిప్ ద్వారా రూ.100 కోట్ల సాయం
దేశంలో బలహీన వర్గాలకు చెందిన బాలికల విద్య కోసం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా బాలికలకు ఉపకారవేతనాలను అందించనుంది.
దేశంలో బలహీన వర్గాలకు చెందిన బాలికల విద్య కోసం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా బాలికలకు ఉపకారవేతనాలను అందించనుంది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టెమ్ స్టార్స్ (STEM Stars) పేరుతో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది.
ఈ స్కాలర్‌షిప్‌ల ద్వారా బాలికల చదువుకు ఆర్థిక సాయం అందుతుందని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలిపింది. ‘ఆడపిల్లల చదువు వారి పిల్లల జీవితంపై ప్రభావం చూపుతుంది. అందుకే మేం 'స్టెమ్ స్టార్స్' స్కాలర్‌షిప్‌ను తీసుకొచ్చినట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్పష్టం చేసింది. బాలికల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అవసరమైన ట్యూషన్ ఫీజు, వసతి ఖర్చులు, స్టడీ మెటీరియల్ ఇలా.. అన్నింటికీ కలిపి ఏడాదికి లక్ష రూపాయలు.. నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయాన్ని అందిస్తామని వెల్లడించింది.
స్టెమ్ స్టార్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ మొదటి దశలో భాగంగా 2,000 మందికి పైగా బాలికల చదువుకు చేయూత అందించనుంది. దేశంలోని ప్రముఖ కళాశాలల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం ఏ విభాగంలో ఉన్నత విద్యను అభ్యసించినా.. ఫౌండేషన్ ద్వారా ఆర్ధికసాయం పొందుతారు. తొలి ఏడాదిలో ఐఐటీ, బిట్స్ పిలానీ, ఎన్‌ఐటీతో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ గుర్తింపు పొందిన ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో చదవాలనుకున్న విద్యార్థులకు సహకారం అందించనున్నట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుమిత్ విర్మనీ తెలిపారు.
ALSO READ:
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్-2023 నోటిఫికేషన్, పరీక్ష ఎప్పుడంటే?
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి..
TS ICET: టీఎస్ ఐసెట్-2023 కౌన్సెలింగ్ వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే!
తెలంగాణలో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదాపడింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 6, 7 తేదీల్లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. తదనంతరం సెప్టెంబరు 8 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. వెబ్ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు ఎంసీఏ, ఎంబీఏ తొలివిడత సీట్లను సెప్టెంబర్ 17న కేటాయించనున్నారు. సెప్టెంబరు 22 నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తాంచనున్నారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..