News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

ఆంధ్రప్రదేశ్‌లోని పీజీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'ఏపీ పీజీసెట్‌-2023' పరీక్షల హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లోని పీజీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'ఏపీ పీజీసెట్‌-2023' పరీక్షల హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్(డిగ్రీ) హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు, పరీక్ష పేపర్ వివరలు నమోదచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలు, హైదరాబాద్‌లో ఒక కేంద్రంలో పరీక్షలు నిర్వహించనున్నారు. 

హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 6 నుంచి 10 వరకు రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు తొలిసెషన్‌లో, మధ్నాహ్నం 1 గంట నుంచి 2.30 గంటల వరకు రెండో సెషన్‌లో తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు మూడో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచే మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. నెగెటివ్ మార్కులు ఉండవు. పరీక్ష సమయం 90 నిమిషాలు.  

జూన్ 8 నుంచి ఆన్సర్ కీలు..
ఇక పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీలను జూన్ 8 నుంచి 12 వరకు సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తారు. అంటే పరీక్ష పూర్తయిన రెండు రోజులకు ఆన్సర్ కీలు విడుదల చేస్తారు. ఇక జూన్ 10 నుంచి 14 వరకు ఆయా ఆన్సర్ కీలపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 

Also Read:

అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)లో ప్రవేశాల కోసం జూన్‌ 6న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ అభ్యాసక సహాయ సేవా విభాగం డైరెక్టర్‌ డా.ఎల్‌ విజయకృష్ణారెడ్డి శనివారం(జూన్‌ 3) ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి 12:30 గంటల వరకు బీఈడీ, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) పరీక్ష జరుగుతుందని.. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందుగా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్‌టికెట్లను సంబంధిత యూనివర్సిటీ పోర్టల్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు.
పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!
ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ప్రవేశాలు కోరేవారు జూన్‌ 4 నుంచి జూన్ 26న సాయంత్రం 5 గంటల్లోపు వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్ధులు రూ.300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా విద్యార్ధులకు సీటు కేటాయింపు ఉంటుంది. ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ఐఐఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు యేటా మూడు సార్లు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. 
ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 04 Jun 2023 06:32 PM (IST) Tags: Education News in Telugu AP PG CET 2023 Halltickets AP PG CET 2023 Admit Card AP PG CET 2023 Hall Ticket AP PG CET 2023 Exam Pattern

ఇవి కూడా చూడండి

సెప్టెంబరు 29 నుంచి బీఫార్మసీ తరగతులు ప్రారంభం, జేఎన్‌టీయూ అకడమిక్ క్యాలెండర్ విడుదల

సెప్టెంబరు 29 నుంచి బీఫార్మసీ తరగతులు ప్రారంభం, జేఎన్‌టీయూ అకడమిక్ క్యాలెండర్ విడుదల

TS TET 2023 Results: టీఎస్ టెట్‌-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు

TS TET 2023 Results: టీఎస్ టెట్‌-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు

US Visa: రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు- 3 నెలల్లో 90 వేల వీసాలు ఇచ్చిన అమెరికా

US Visa: రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు- 3 నెలల్లో 90 వేల వీసాలు ఇచ్చిన అమెరికా

CTET 2023 Results: సీటెట్‌ (జులై) - 2023 ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ కోసం డైరెక్ట్ లింక్

CTET 2023 Results: సీటెట్‌ (జులై) - 2023 ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ కోసం డైరెక్ట్ లింక్

AP ECET: ఏపీఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

AP ECET: ఏపీఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు

Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా

Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా