By: ABP Desam | Updated at : 03 Jun 2023 10:49 AM (IST)
Edited By: omeprakash
ఏపీ ఆర్జీయూకేటీ ప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ప్రవేశాలు కోరేవారు జూన్ 4 నుంచి జూన్ 26న సాయంత్రం 5 గంటల్లోపు వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్ధులు రూ.300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్ధులకు సీటు కేటాయింపు ఉంటుంది.
ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ఐఐఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు యేటా మూడు సార్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. అధికారిక వెబ్‌సైట్ నుంచి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆయా తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్ధులకు రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్ కోర్సుతో కలిపి మొత్తం ఆరేళ్ల కోర్సులో ప్రవేశాలు పొందుతారు. ప్రవేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా నాలుగు శాతం మార్కులు కేటాయిస్తారు.
జులై 13న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల కానుంది. ఇక ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభంకానున్నాయి. 4 క్యాంపస్‌లలో కలిపి 4,400 సీట్లు భర్తీ చేయనున్నారు. ఇందులో 85 శాతం సీట్లు ఏపీ అభ్యర్థులకు, 15 శాతం సీట్లు తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఓపెన్ మెరిట్ కింద కేటాయిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్ స్కోర్‌ను జోడించి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
వివరాలు..
* ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు - 2023
ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్
వ్యవధి: 6 సంవత్సరాలు (పీయూసీ రెండేళ్లు, బీటెక్ నాలుగేళ్లు)
అర్హత: ఈ ఏడాది నిర్వహించిన పదోతరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్ధులు రూ.300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
Rule of Reservation for Admission
Also Read:
పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2023 విద్యా సంవత్సరం ఇంటర్ చదువుతున్న 120 మంది పేద విద్యార్థులకు ‘విద్యాధన్’ స్కాలర్‌షిప్‌లు విద్యాధన్ పేరిట సరోజిని దామోదరన్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు అందజేస్తోంది. 90 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జూన్ 15, తెలంగాణ విద్యార్థులు జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
స్కాలర్‌షిప్ వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ మే 29న ప్రారంభంకాగా.. జూన్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆలస్య రుసుముతో జూన్ 15 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 19న వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..
TS TET: తెలంగాణ 'టెట్' పేపర్-1లో 36.89 శాతం, పేపర్-2లో 15.30 శాతం ఉత్తీర్ణత
Telangana Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు ఖాయం - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !
TS TET 2023 Results: తెలంగాణ 'టెట్' ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే
TS TET 2023 Results: 27న తెలంగాణ 'టెట్' ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!
AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్ 'స్పాట్ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్‌కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
/body>