అన్వేషించండి

AP LAWCET 2024: ఏపీ లాసెట్, ఏపీ పీజీఎల్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

Andhra Pradesh న్యాయ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ లాసెట్/ పీజీఎల్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 26న ప్రారంభమైంది. ఏప్రిల్ 25 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

AP LAWCET Appliction: ఏపీలోని న్యాయ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి ఏపీ లాసెట్/ పీజీఎల్‌సెట్ (AP LAWCET 2024/PGLCET 2024) నోటిఫికేషన్ మార్చి 22న విడుదలైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 26న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. లాసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఏపీలోని లా కాలేజీల్లో 3, 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ డిగ్రీ కోర్సులు, 2 సంవత్సరాల పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది జూన్ 9న లాసెట్/పీజీఎల్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. లాసెట్ దరఖాస్తుకు జనరల్ అభ్యర్థులు రూ.900; బీసీ అభ్యర్థులు రూ.850; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.800 చెల్లిస్తే సరిపోతుంది. పీజీఎల్‌సెట్ దరఖాస్తుకు జనరల్ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఓబీసీ అభ్యర్థులు రూ.950 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.900 చెల్లిస్తే సరిపోతుంది. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు, రూ.1000 అపరాధ రుసుంతో మే 4 నుంచి 11 వరకు, రూ.2000 అపరాధ రుసుంతో మే 12 నుంచి 20 వరకు, రూ.3000 అపరాధ రుసుంతో మే 21 నుంచి 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వివరాల్లో తప్పులుంటే మే 30 నుంచి జూన్ 1 వరకు మార్పులు చేసుకోవచ్చు. జూన్ 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 9 మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు ఆన్‌లైన్‌ విధానంలో లాసెట్/పీజీఎల్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 

వివరాలు..

* ఏపీ లాసెట్, ఏపీ పీజీఎల్‌సెట్ - 2024 (AP LAWCET/ AP PGLCET 2024)

కోర్సుల వివరాలు..

1) మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు 

- ఎల్‌ఎల్‌బీ 

- ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)

అర్హత: 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

2) ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు 

- బీఏ ఎల్‌ఎల్‌బీ

- బీకామ్ ఎల్‌ఎల్‌బీ

- బీబీఏ ఎల్‌ఎల్‌బీ

అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

3) రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు

అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు..

➦ లాసెట్ దరఖాస్తుకు జనరల్ అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. ఓబీసీ అభ్యర్థులు రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.800 చెల్లిస్తే సరిపోతుంది.

➦ పీజీఎల్‌సెట్ దరఖాస్తు్కు జనరల్ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఓబీసీ అభ్యర్థులు రూ.950 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.900 చెల్లిస్తే సరిపోతుంది. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

లాసెట్ పరీక్ష విధానం:
➥ మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. వీటిలో పార్ట్-ఎ: జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ 30 ప్రశ్నలు-30 మార్కులు, పార్ట్-బి: కరెంట్ ఎఫైర్స్ 30 ప్రశ్నలు-30 మార్కులు, పార్ట్-సి: ఆప్టిట్యూడ్ (స్టడీ ఆఫ్ లా) 60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పార్ట్-సిలో బేసిక్ లా ప్రిన్సిపుల్స్, భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.  తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.

➥ ఐదేళ్ల లా కోర్సు పరీక్ష రాసేవారికి ఇంటర్ స్థాయిలో, మూడేళ్ల లా కోర్సు పరీక్ష రాసేవారికి డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. అభ్యర్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో కనీసం అర్హత మార్కులను 35 శాతం అంటే 42 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు. పరీక్ష సమయం 90 నిమిషాలు.

పీజీఎల్‌సెట్ పరీక్ష విధానం:
మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. పరీక్షలో మొత్తం 2 సెక్షన్లు (పార్ట్-ఎ, పార్ట్-బి) ఉంటాయి. ఇందులో పార్ట్-ఎ నుంచి 40 పశ్నలు, పార్ట్-బి నుంచి 80 పశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే పరీక్ష ఉంటుంది. పరీక్షలో అర్హత మార్కులను 25 శాతంగా (30 మార్కులు) నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి కనీస మార్కులు లేవు. 

ముఖ్యమైన తేదీలు...

➥ నోటిఫికేషన్ వెల్లడి: 22.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.04.2024.

➥ రూ.500 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 03.05.2024. 

➥ రూ.1000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 11.05.2024.

➥ రూ.2000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 20.05.2024.

➥ రూ.3000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 29.05.2024.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 30.05.2024 - 01.06.2024.

➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 03.06.2024 నుంచి.

➥  పీజీఈసెట్ పరీక్ష తేది: 09.05.2024 వరకు.

(పరీక్ష సమయం: మ. 02.30 గం. . సా. 4.00 గం. వరకు.)

Notification

Detailed Notification

Online Application

Fee Payment

WEBSITE

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget