News
News
వీడియోలు ఆటలు
X

AP Inter Results 2023: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్

AP Intermediate Results 2023 Check Online: ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

AP Intermediate Results 2023 Online Link:  విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలతో పాటు ఒకేషనల్ విద్యార్థుల ఫలితాలను సైతం విద్యాశాఖ మంత్రి బొత్స ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ లో 72 శాతం విద్యార్థులు పాస్ అయినట్లు మంత్రి బొత్స తెలిపారు. మొదటి సంవత్సరంలో బాలికలు పైచేయి సాధించగా, ద్వితీయ సంవత్సరంలో బాలురుది పైచేయి అని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2022-2023 అకడమిక్ ఇయ‌ర్ గాను ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ పరీక్ష కేంద్రాల్లో మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు నిర్వహించింది. 

మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15న, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 3న ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్‌ 4న ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. కేవలం మూడు వారాల వ్యవధిలోనే ఏపీ విద్యాశాఖ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/  వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి బొత్స సూచించారు. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు ఏప్రిల్ 25న ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ఏడాది ఏపీలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది విద్యార్థులు పరీక్షకు హాజ‌రయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,489  కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు రాశారు. వీరిలో 9,20,552 మంది రెగ్యులర్‌, 83,749 మంది ఒకేషనల్‌ విద్యార్థులు ఉన్నారు.

ఏపీ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-11-62b2b6cc2734e.html

ఏపీ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-12-62b2b7e4abc44.html 

గత కొన్నేళ్లుగా సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఇలా ఉన్నాయి..
* 2015 - 55.87 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు
* 2016లో 60.59 శాతం 
* 2017లో 60.01 శాతం
* 2018లో 57 శాతం 
* 2019లో 55 శాతం 
* 2020లో 59 శాతం 
* 2022లో 61 శాతం 
* 2023లో 72 శాతం 

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి 
Step 1: ఏపీ ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్   https://bie.ap.gov.in/ సందర్శించండి
Step 2: హోం పేజీలో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2023 లింక్ (Andhra Pradesh Inter Results 2023 link) మీద క్లిక్ చేయండి
Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలి
Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: విద్యార్థులు రిజల్ట్స్‌ స్కోర్ కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీల ప్రవేశాల సమయంలో మీ ఇంటర్ స్కోర్ కార్డు అవసరాల కోసం రిజల్ట్ ు ప్రింటౌట్ తీసుకోవడం బెటర్.

ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు..

https://examresults.ap.nic.in

www.bie.ap.gov.in 

Published at : 26 Apr 2023 06:37 PM (IST) Tags: AP Inter 1st Year Results AP Inter Results 2023 AP Inter 1st Year & 2nd Year Results AP Inter 2nd year results Intermediate Results 2023

సంబంధిత కథనాలు

Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!

Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

TS DEECET: డీఈఈసెట్‌ ప్రిలిమినరీ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

TS DEECET: డీఈఈసెట్‌ ప్రిలిమినరీ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

హెచ్‌సీయూలో ఎంటెక్ కోర్సు, ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు!

హెచ్‌సీయూలో ఎంటెక్ కోర్సు, ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?