By: ABP Desam | Updated at : 27 Jun 2022 03:14 PM (IST)
ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
AP Inter 1st Year Supply Exam Date 2022: ఏపీ ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదల కాగా, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో 54 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్‌లో 61 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇంటర్ వొకేషనల్ పరీక్షల్లో ఫస్టియర్‌లో 45 శాతం, సెకండియర్ పరీక్షల్లో 55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆగస్టు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు తొలిసెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ కింద పరీక్షలు జరుగుతాయి. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రెండు సబ్జెక్ట్స్ ఫెయిలైన వారికి కష్టమే. ఉదయం పేపర్ 1 రాసి మధ్యాహ్నం పేపర్ 2 రాయాల్సి ఉంటుంది.
ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు..
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులతో పాటు ఇంప్రూవ్ మెంట్ రాయాలనుకునే విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలు విడుదల చేసిన రోజే మంత్రి బొత్స సప్లిమెంటరీ తేదీలను ప్రకటించారు. జూన్ 25 నుంచి జూలై 8 వరకు ఇంటర్ విద్యార్థులు సప్లిమెంటరీ ఫీజును చెల్లించవచ్చు. రెగ్యూలర్ విద్యార్థులు రూ.500, ఒకేషనల్ కోర్సులకు రూ.700, బ్రిడ్జి కోర్సులకు రూ.145 చొప్పున ఫీజును చెల్లించాలి.
ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్..
ఆగస్టు 3 - సెకండ్ లాంగ్వేజ్
ఆగస్టు 4 - ఇంగ్లీష్
ఆగస్టు 5 - మ్యాథ్స్ పేపర్–1ఏ, సివిక్స్, బోటనీ
ఆగస్టు 6 - మ్యాథ్స్–1బీ, హిస్టరీ, జువాలజీ
ఆగస్టు 8 - ఫిజిక్స్, ఎకనావిుక్స్
ఆగస్టు 10 - కెవిుస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
ఆగస్టు 11 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ (Bipc విద్యార్థులకు)
ఆగస్టు 12 - మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ
ఏపీ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్..
ఆగస్టు 3 - సెకండ్ లాంగ్వేజ్
ఆగస్టు 4 - ఇంగ్లీష్
ఆగస్టు 5 - మ్యాథ్స్ పేపర్–2ఏ, సివిక్స్, బోటనీ
ఆగస్టు 6 - మ్యాథ్స్–2బీ, హిస్టరీ, జువాలజీ
ఆగస్టు 8 - ఫిజిక్స్, ఎకనావిుక్స్
ఆగస్టు 10 - కెవిుస్ట్రీ, సోషియాలజీ, కామర్స్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
ఆగస్టు 11 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ (Bipc విద్యార్థులకు)
ఆగస్టు 12 - మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ
Also Read: AP Inter Revaluation 2022: ఇంటర్‌లో మార్కులు తక్కువగా వచ్చాయనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి
TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల
JAM-2023: ఐఐటీల్లో ఉన్నత చదువులకు మార్గం 'జామ్' - నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలు!
OU PG Exams: ఓయూ పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా, కారణమిదే?
LIC HFL Vidyadhan Scholarship: విద్యార్థి చదువుకు ఉపకారం, ‘విద్యాధనం’ స్కాలర్షిప్!
Virchow Scholarship Program: బాలికల విద్యకు ప్రోత్సాహం - విర్చో స్కాలర్షిప్ ప్రోగ్రామ్
Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?
Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !
కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్తో మెగా హీరో నిశ్చితార్థం!
టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా?