AP Inter Supplementary Results: నేడు ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
AP Inter Results: ఏపీలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం (జూన్ 18) విడుదల కానున్నాయి. మొదట ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఇంటర్ బోర్డు వెల్లడించనుంది.
AP Inter 2nd Year Supplementary Results: ఏపీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (Inter Second Year Supplementary Results) పరీక్షల ఫలితాలను నేడు (జూన్ 18) విడుదల చేయనున్నారు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 1.40 లక్షల మంది హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్‌లలోనూ ఫలితాలు చూసుకోవచ్చు. మరోవైపు ఇంటర్ మొదటి సంవత్సరం (Inter First Year Supplementary Results) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను జూన్ 26న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
Step 1: ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://bie.ap.gov.in/ సందర్శించాలి.
Step 2: అక్కడ హోంపేజీలో 'ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: అక్కడ అడిగిన వివరాలు నమోదు చేయాలి
Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: విద్యార్థులు రిజల్ట్స్ స్కోర్ కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 4,61,273 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 3,10,875 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 3,93,757 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 3,06,528 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంటర్ ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 38,483 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 23,181 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 32,339 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 23,000 మంది పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 80 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహించారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఒకే రోజు రెండు విడతలుగా పరీక్షలు జరిగాయి. ఇందులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది ఉన్నారు. ఇంటర్మిడియెట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేశారు. జూన్ 18న ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేసింది.
ALSO READ:
ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సు, టెన్త్ పాసైతే చాలు
ఏపీలోని ఫిషరీస్ యూనివర్సిటీలో రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 10న ప్రారంభంకాగా.. జూన్ 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆలస్యరుసుముతో జూన్ 29 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. మొత్తం 495 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం సీట్లలో ఓసీలకు 50 శాతం, బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం కేటాయించారు. పదోతరగతి లేదా తత్సమాన పరీక్షల్లో మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..