అన్వేషించండి

APFU Admissions: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సు, టెన్త్ పాసైతే చాలు

APFU Diploma Course: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ డిప్లొమా ఇన్‌ ఫిషరీస్‌ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. పదోతరగతి అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. జూన్ 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

APFU Admission into Diploma in Fisheries Programme: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ మత్స్య విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా యూనివర్సిటీ పరిధిలో మొత్తం 495 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం సీట్లలో ఓసీలకు 50 శాతం, బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం కేటాయించారు. పదోతరగతి లేదా తత్సమాన పరీక్షల్లో మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 10న ప్రారంభంకాగా.. జూన్ 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆలస్యరుసుముతో జూన్ 29 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు, సర్టిఫికేట్ల వివరాల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు జులై 2, 3 తేదీల్లో అవకాశం కల్పించింది. అభ్యర్థులు జులై 6న వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.

వివరాలు..

* డిప్లొమా ఇన్‌ ఫిషరీస్‌ ప్రోగ్రామ్‌ (ఇంగ్లిష్‌ మీడియం) 

కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.

సీట్ల సంఖ్య: 495 (ప్రభుత్వ కళాశాలల్లో 55, అనుబంధ కళాశాలల్లో 440).

ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ పరిధిలోని విద్యాసంస్థలు..

i) బోధన సంస్థలు 

a) రాజ్యాంగబద్ద కళాశాలలు 

➥ కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, ముతుకూరు,నెల్లూరు జిల్లా 

➥ కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, నర్సాపురం, పశ్చిమగోదావరి జిల్లా.

b) పాలిటెక్నిక్ కళాశాలలు

1. రాజ్యాంగబద్ద పాలిటెక్నిక్ కళాశాలలు 

➥శ్రీ ఎంవీకేఆర్ ఫిషరీస్ పాలిటెక్నిక్, భవదేవరపల్లి, క్రిష్ణా జిల్లా. 

2.  అనుబంధ ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలు  

➥ బి.ఆర్. ఫిషరీ పాలిటెక్నిక్, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా. 

➥బెల్లంకొండ ఫిషరీస్ పాలిటెక్నిక్, కంభాలపాడు, ప్రకాశం జిల్లా. 

➥ పైడా కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ పాలిటెక్నిక్, పటవల, కాకినాడ జిల్లా. 

➥ పైడా గ్రూప్ ఫిషరీస్ పాలిటెక్నిక్, పటవల, కాకినాడ జిల్లా.

➥ శ్రీహరి ఫిషరీస్ పాలిటెక్నిక్, పసుపుల, కర్నూలు జిల్లా.

➥ శ్రీ వేంకటేశ్వర ఫిషరీస్ పాలిటెక్నిక్, ఎస్‌ఎస్‌ఆర్ పురం, శ్రీకాకుళం జిల్లా. 

➥ శ్రీ వేంకటేశ్వర ఫిషరీస్ పాలిటెక్నిక్, తక్కోలు, కడప జిల్లా. 

➥ శ్రీనిధి ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్, చేకూరపాడు, ప్రకాశం జిల్లా.

ii) ఫిషరీస్ రిసెర్చ్ స్టేషన్లు:

➥ ఫిషరీస్ రిసెర్చ్ స్టేషన్, కాకినాడ, కాకినాడ జిల్లా. 

➥ ఫిషరీస్ రిసెర్చ్ స్టేషన్, ఉండి, పశ్చిమగోదావరి జిల్లా. 

➥ ఇన్‌స్ట్రక్షల్ కమ్ రిసెర్చ్ ఆక్వా ఫార్మ్, బలభద్రాపురం, తూర్పుగోదావరి జిల్లా. 

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

వయోపరిమితి: 31.08.2024 నాటికి 15 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్థులు 31.08.2002 - 31.08.2009 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కులు, స్థానికత, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు..

✪ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఏపీ ప్రభుత్వం జారీచేసిన తాజా సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ (క్యా్స్ట్ సర్టిఫికేట్).

✪ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (2024-25 సంవత్సరానికి సంబంధించినది).

✪ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్

✪నాన్ మున్సిపల్ ఏరియా కోటా కింద అర్హులైనవారికి నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ (ఫామ్-1) తీసుకోవాలి.

✪ దివ్యాంగులైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ ఉండాలి.

✪ సైనిక కుటుంబాలకు చెందినవారైతే ఆర్మ్‌డ్ పర్సనల్ సర్టిఫికేట్/ డిఫెన్స్ పర్సనల్ సర్టిఫికేట్ తప్పనిసరి.

✪ఎన్‌సీసీ కోటా కింద అర్హులైనవారు NCC సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

✪స్పోర్ట్స్ కోటా కింద ప్రయోజనం పొందాలనుకునేవారు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు: 

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.06.2024.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 26.06.2024.

✦ ఆలస్య రుసుముతో దరఖాస్తు తేదీలు: 27.06.2024 - 29.06.2024.

✦ సర్టిఫికేట్స్‌ ఎడిట్‌ ఆప్షన్: 02.07.2024 & 03.07.2024.

✦ వెబ్‌ఆప్షన్ల నమోదు: 06.07.2024.

Notiication

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Clown Kohli: కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Clown Kohli: కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
BJP Leader Annamalai : డీఎంకేను గద్దె దించే దీక్ష చేపట్టిన అన్నామలై - కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
డీఎంకేను గద్దె దించే దీక్ష చేపట్టిన అన్నామలై - కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
Embed widget