అన్వేషించండి

AP EAPCET: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ! ఎంతంటే?

రెండేళ్లు ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని తొలగించారు. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాసినందున 2023-24కు వెయిటేజీని పునరుద్ధరించారు.

ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఇవ్వనున్నారు. 2020-21, 2021-22లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. దీంతో రెండేళ్లు ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని తొలగించారు.

ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాసినందున 2023-24కు వెయిటేజీని పునరుద్ధరించారు. గతేడాది ప్రథమ సంవత్సరంలో 70శాతం సిలబస్‌నే విద్యార్థులు చదివినందున ఈఏపీసెట్‌లోనూ ఆ మేరకే ప్రశ్నలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది మే 15 నుండి 22 తేదీల మధ్య ఏపీఈఏపీసెట్(ఎంపీసీ) పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా ఏపీ ఈఏపీసెట్ (బైపీసీ) ప్రవేశపరీక్షను మే 23 నుండి 25 తేదీల మధ్య నిర్వహించనున్నారు.

ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సిందే..
ఇంటర్మీడియట్‌లోని నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్షల్లో విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణులుకావాలని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. ఈ పరీక్షలను బుధవారం, శుక్రవారం నిర్వహిస్తున్నామని, గతంలో అనుత్తీర్ణులైన వారు, పరీక్ష రాయని విద్యార్థులు కళాశాలల నుంచి పాత హాల్‌టికెట్లను తీసుకోవాలని సూచించారు. ఈ పరీక్షల్లో పాస్ కానివారికి ఉత్తీర్ణత సర్టిఫికెట్లు ఇవ్వబోమని వెల్లడించారు.

ఇంట‌ర్‌ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..

➥ మార్చి 15 - బుధవారం - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1

➥ మార్చి 17 - శుక్రవారం - ఇంగ్లిష్ పేపర్-1

➥ మార్చి 20 - సోమవారం - మ్యాథ్స్‌ పేపర్‌-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1.

➥ మార్చి 23 - గురువారం - మ్యాథ్స్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1

➥ మార్చి 25 - శనివారం - ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్‌ పేపర్-1

➥ మార్చి 28 - మంగళవారం - కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-1

➥ మార్చి 31 - శుక్రవారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).

➥ ఏప్రిల్ 3 - సోమవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1


Also Read: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యతేదీలివే! 


ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..

➥ మార్చి 16 - గురువారం - సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-2

➥ మార్చి 18 - శనివారం - ఇంగ్లిష్‌ పేపర్-2

➥ మార్చి 21 - మంగళవారం - మ్యాథ్స్‌ పేపర్‌-2ఎ, బోటనీ, సివిక్స్-2.

➥ మార్చి 24 - శుక్రవారం - మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్‌-2.

➥ మార్చి 27 - సోమవారం - ఫిజిక్స్ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2.

➥ మార్చి 29 - బుధవారం - కెవిుస్ట్రీ పేపర్‌-2, కామర్స్ పేపర్‌-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-2

➥ ఏప్రిల్ 1 - శనివారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).

➥ ఏప్రిల్ 4 - మంగళవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2

ఇతర పరీక్షల తేదీలు ఇలా..

➥ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష: 22.02.2023 (బుధవారం).

➥  ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష: 24.02.2023 (శుక్రవారం).

Also Read:

తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
తెలంగాణలోని గిరిజన (ఎస్టీ) గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను 'తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023' విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతోపాటు, ఉచిత వసతి ఉంటుంది. వీరికి ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.
ప్రవేశ ప్రకటన, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో 2023-2024 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం రాష్ట్ర మైనారిటీస్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) నోటిఫికేన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 204 మైనార్టీ పాఠశాలలు, 12 జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో 107 బాలుర పాఠశాలలు ఉండగా, 97 బాలికల పాఠశాలలు ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Sa 3rd t20 highlights: మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
Sahana Sahana Song : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్

వీడియోలు

భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Sa 3rd t20 highlights: మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
Sahana Sahana Song : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Movie Shootings Famous Tree: సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
Hardik Pandya Records: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలో తొలి ఆల్ రౌండర్‌గా అరుదైన ఘనత
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలో తొలి ఆల్ రౌండర్‌గా అరుదైన ఘనత
Ind u19 vs Pak u19 highlights: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. 90 పరుగులతో ఘన విజయం
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. 90 పరుగులతో ఘన విజయం
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
Embed widget