AP EAMCET Cutoff 2022: ఈఏపీసెట్ అభ్యర్థులకు అలర్ట్ - కటాఫ్, ఇంటర్ వెయిటేజీపై మంత్రి బొత్స కీలక ప్రకటన
AP EAPCET Results 2022: ఈఏపీ సెట్ ఫలితాలను మంత్రి బొత్స విడుదల చేశారు. ఈ ఏడాది కటాఫ్ మార్కులను జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 40 అని ప్రకటించారు.
ఏపీలో ఈఏపీసెట్ 2022 ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. ఈ ఏడాది ఈఏపీసెట్ 2 లక్షల 82 వేల 496 మంది పరీక్ష రాయగా, 2 లక్షల 56 వేల 983 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి బొత్స తెలిపారు. ఇంజినీరింగ్ లో 89.12 శాతం క్వాలిఫై అయ్యారు. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 87 వేల 744 మంది పరీక్షకు హాజరుకాగా 83 వేల 411 మంది క్వాలిఫై అయ్యారు. 95.06 శాతం అభ్యర్థులు అగ్రికల్చర్ విభాగంలో అర్హత సాధించినట్లు చెప్పారు. ఇంజినీరింగ్ విభాగంలో 1 లక్షా 48 వేల 283 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2 లక్షల 6 వేల 579 మంది దరఖాస్తు చేసుకోగా, 1 లక్షా 94 వేల 752 మంది పరీక్ష రాయగా 1 లక్షా 73 వేల 572 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి బొత్స తెలిపారు. Engineering Results Check Here
క్వాలిఫికేషన్ కటాఫ్ మార్కులు..
జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో ఈ ఏడాది ఈఏపీసెట్ జరిగింది. ఈ సారి ఇంటర్ మార్కులుకు ఈఏపీ సెట్ 2022లో ఎలాంటి వెయిటేజీ లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. గతంలో ఇంటర్ మార్కులకు ఇరవై శాతం అలా వెయిటేజీ తీసుకుని, ఎంసెట్ ర్యాంకును ఎనభై శాతం వెయిటేజీగా తీసుకునేవారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌లో జనరల్, ఓబీసీ విభాగంలో 40 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు నిర్ధారిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పరీక్షకు హాజరైతే చాలు, వారిని క్వాలిఫై అయినట్లు పరిగణిస్తామని మంత్రి బొత్స వెల్లడించారు. పరీక్షలు నిర్వహించిన కేవలం రెండు వారాల్లోనే ఫలితాలు విడుదల చేశామన్నారు. Agriculture Results Check Here
ఈఏపీసెట్ 2022 ఫలితాలు విడుదల
నేడు ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ ఫలితాలు (AP EAPCET Results 2022) ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేశారు. జూలై 26న ఉదయం 11 గంటలకు విజయవాడ లో మంత్రి బొత్స చేతుల మీదుగా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Also Read: AP EAMCET Results 2022: ఈఏపీసెట్ 2022 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
కౌన్సెలింగ్ సమయంలో ఏపీ ఎంసెట్- 2022 ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్, ఇంటర్మీడియట్ మెమో, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్(టీసీ), పదో తరగతి మార్కుల మెమో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్( వర్తించే వారు మాత్రమే తీసుకెళ్లాలి), నివాస ధ్రువీకరణ పత్రం, ఇన్‌కమ్ సర్టిఫికేట్ లాంటి పత్రాలు అవసరం ఉంటుంది.