AP EAMCET Results 2022: ఈఏపీసెట్ 2022 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
AP EAPCET Results 2022: ఈఏపీసెట్ ఫలితాలను రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
AP EAMCET Results 2022: ఏపీలో వరుసగా పరీక్షల ఫలితాలు వస్తున్నాయి. ఇదివరకే రాష్ట్రంలో టెన్త్ క్లాస్, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడదలయ్యాయి. నేడు ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ ఫలితాలు (AP EAPCET Results 2022) ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేశారు. జూలై 26న ఉదయం 11 గంటలకు విజయవాడ లో మంత్రి బొత్స చేతుల మీదుగా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Engineering Results Check Here
ఈ ఏడాది ఈఏపీసెట్ 2 లక్షల 82 వేల 496 మంది పరీక్ష రాయగా, 2 లక్షల 56 వేల 983 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి బొత్స తెలిపారు. ఇంజినీరింగ్ లో 89.12 శాతం క్వాలిఫై అయ్యారు. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 87 వేల 744 మంది పరీక్షకు హాజరుకాగా 83 వేల 411 మంది క్వాలిఫై అయ్యారు. 95.06 శాతం అభ్యర్థులు అగ్రికల్చర్ విభాగంలో అర్హత సాధించినట్లు చెప్పారు. ఇంజినీరింగ్ విభాగంలో 1 లక్షా 48 వేల 283 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2 లక్షల 6 వేల 579 మంది దరఖాస్తు చేసుకోగా, 1 లక్షా 94 వేల 752 మంది పరీక్ష రాయగా 1 లక్షా 73 వేల 572 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి బొత్స తెలిపారు.Agriculture Results Check Here
రెండు వారాల్లోనే రిజల్ట్స్..
జూలై 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఏపీలో ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ ఎగ్జామ్ జూలై 4 నుంచి 8వ తేదీ వరకు జరిగాయి. అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలను 11, 12వ తేదీల్లో నిర్వహించారు. అయితే ఈఏపీసెట్ పూర్తయిన రెండు వారాల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేస్తోంది ఏపీ ప్రభుత్వం.
ఈ ఏడాది ఈఏపీ సెట్ కు మొత్తం 3,01,172 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 2,82,496 మంది ఈఏపీసెట్ కు హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్ విభాగం నుంచి 1,94,752 మంది, వ్యవసాయ కోర్సులో పరీక్షలకు 87,744 మంది హాజరయ్యారు. ఈఏపీ సెట్ ర్యాంకులతో ఇంజినీరింగ్ కాలేజీలు, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాలు పొందటానికి వీలుంటుంది. త్వరలోనే ఆయా విభాగాలకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారులు చెప్పారు.
కౌన్సెలింగ్ సమయంలో ఏపీ ఎంసెట్- 2022 ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్, ఇంటర్మీడియట్ మెమో, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్(టీసీ), పదో తరగతి మార్కుల మెమో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్( వర్తించే వారు మాత్రమే తీసుకెళ్లాలి), నివాస ధ్రువీకరణ పత్రం, ఇన్‌కమ్ సర్టిఫికేట్ లాంటి పత్రాలు అవసరం ఉంటుంది.
Also Read: AP ECET Key 2022: ఏపీ ఈసెట్ కీ పేపర్ విడుదల, రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ!
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ రెండో విడత పరీక్షలను అనూహ్యంగా వాయిదా వేశారు. గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను చివరి క్షణంలోవాయిదా వేయడంతో విద్యార్థులు గందరగోళగానికి గురవుతున్నారు. బుధవారం జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) కీలక నిర్ణయం ప్రకటించింది. పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ను ప్రకారం పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పరీక్ష వాయిదాకు గల కారణాలు చెప్పలేదు. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు జరిగాయి. ఫలితాలు జూలై 11న ప్రకటించారు.