అన్వేషించండి

AP SSC Exams: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్ - ఏపీలో ఈసారి ప్రీఫైనల్, పబ్లిక్ పరీక్షలు ఎప్పుడంటే?

AP Schools Calendar: ఏపీలో పాఠశాలలకు ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఏడాది 233 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి. 82 రోజులు సెలవులు ఉండనున్నాయి.

AP Schools Calendar: ఏపీలోని పాఠశాలలకు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. పాఠశాలలు తెరచిన నెలన్నర తర్వాత అకడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలల పని దినాలు, సెలవుల వివరాలు, పాఠశాలల పని సమయాలు, పరీక్షల షెడ్యూలు వివరాలను క్యాలెండర్‌లో విద్యాశాఖ పొందుపరిచింది. ఈ క్యాలెండర్ ప్రకారమే పాఠశాలలు పనిచేయాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరంలో 233 రోజులపాటు స్కూల్స్ పని చేయనున్నాయి. వేసవి సెలవులు మినహాయించి మొత్తం 315 రోజులు కాగా.. ఇందులో 82 రోజులు సెలవులు ఉన్నాయి. ఇందులో సాధారణ సెలవులు, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, క్రిస్మస్ సెలవులు, వేసవి సెలవులు ఉన్నాయి.

అలాగే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పరీక్షల (FA, SA) షెడ్యూలును కూడా అకడమిక్ క్యాలెండర్‌లో ప్రకటించారు. ఇక అకస్మికంగా ప్రకటించే సెలవులు ఇందుకు అదనంగా ఉంటాయి. గత విద్యాసంవత్సరానికి సంబంధించి పదోతరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 18 నుంచి 31 వరకు పదోతరగతి పరీక్షలను నిర్వహించారు. ఈ విద్యాసంవత్సరంలోనూ మార్చి మూడోవారంలోనే పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

పాఠశాలల సమయమిదే..
రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు కొనసాగనున్నాయి. రెండు విభాగాలకు చివరి పీరియడ్‌ను క్రీడలకు ఆప్షనల్‌గా పేర్కొన్నారు. 

AP Primary & Foundational Schools Academic Calendar 2024-25 

AP High Schools Academic Calendar 2024-25

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో పరీక్షల షెడ్యూలు ఇదే..

➥ ఫార్మాటివ్ అసెస్‌మెంట్(FA)-1 (సీబీఏ-I 1-8వ తరగతులకు): ఆగస్టు 27 - 31 వరకు

➥ ఫార్మాటివ్ అసెస్‌మెంట్(FA)-2: అక్టోబరు 21 - 25 వరకు

➥ సమ్మేటివ్ అసెస్‌మెంట్(SA)-1: నవంబరు 25 - డిసెంబరు 4 వరకు

➥ ఫార్మాటివ్ అసెస్‌మెంట్(FA)-3 (సీబీఏ-II 1-8వ తరగతులకు): 2025, జనవరి 27 - 31 వరకు

➥పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు: 2025, ఫిబ్రవరి 10-20 వరకు.

➥ పదోతరగతి పబ్లిక్ పరీక్షలు: 2025, మార్చి మూడోవారం నుంచి.

➥  ఫార్మాటివ్ అసెస్‌మెంట్(FA)-4 (1-9వ తరగతులకు): 2025, మార్చి 3 - 7 వరకు.

➥  సమ్మేటివ్ అసెస్‌మెంట్(SA)-2 (సీబీఏ-III 1-8వ తరగతులకు): : 2025, ఏప్రిల్ 7 - 17 వరకు.

విద్యాసంవత్సరం సెలవులు ఇవే..

➥ దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.

➥  క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.

➥ అక్టోబరు 31న దీపావళి

➥ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 22 నుంచి 29 వరకు. 

➥ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు.

➥ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు. 

మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు..
ఏపీలోని పాఠశాలలకు సంబంధించిన 2024-25 అకడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ జులై 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి, మంత్రి ఫోటోలు లేకుండా రాజకీయాలకు అతీతంగా స్కూల్ అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించినట్లు లోకేశ్ తెలిపారు. రాజకీయాలకు ప్రభుత్వ విద్యాలయాలను అతీతంగా ఉంచాల‌ని స్పష్టం చేశాను. స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల పదవీకాలం జూలైతో పూర్తయినందున ఆగస్టులో కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని సూచించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని నిర్ణయించారు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా మంత్రి అధికారులకు సూచించారు. సీబీఎస్ఈ స్కూళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి లోకేష్ త్వరలో తదుపరి రూట్ మ్యాప్ ప్రకటిస్తామని చెప్పారు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రి లోకేష్, విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా సూచించారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget