అన్వేషించండి

APRCET 2023-24: ఏపీ ఆర్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా

ఏపీలోని 17 యూనివర్సిటీలలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్(ఫుల్ టైమ్/పార్ట్ టైమ్) ప్రవేశాల కోసం నిర్వహించే APRCET-2024 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. మార్చి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

APRCET-2024 Notification: ఏపీలోని 17 యూనివర్సిటీలలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్(ఫుల్ టైమ్/పార్ట్ టైమ్) ప్రవేశాల కోసం నిర్వహించే 'ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APRCET-2024)' నోటిఫికేషన్ ఫిబ్రవరి 15న విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏప్రిల్‌ 4 నుంచి 7 వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణలకు వెసులుబాటు కల్పించింది. అయితే ప్రవేశ పరీక్ష తేదీని మాత్రం ఖరారు చేయలేదు. ఏప్రిల్‌లో రెండు విడతలుగా పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మొత్తం 68 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మరింత సమాచారం కోసం 90304 07022 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. ఈసారి తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏపీ ఆర్‌సెట్‌ 2024ను నిర్వహిస్తోంది. పరీక్షకు సబంధించిన మాక్ టెస్ట్‌ను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 

వివరాలు..

* ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్‌సెట్)-2024

విభాగాలు: సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ ప్లానింగ్, లా అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ తదితరాలు.

అర్హతలు:  55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(సైన్స్, ఆర్ట్స్, మేనేజ్మెంట్, కామర్స్, లా, ఫార్మసీ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు) ఉత్తీర్ణులై ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర రిజర్వేషన్కేటగిరీ అభ్యర్థులు 50శాతం మార్కులు సాధించాలి. పీజీ చివరి సంవత్సరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులూ అర్హులే.

దరఖాస్తు ఫీజు: రూ.1500. బీసీ అభ్యర్థులు రూ.1300, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. యూజీసీ నెట్, సీఎస్ఐఆర్; నెట్, గేట్, స్లెట్, జీప్యాట్, ఎంఫిల్ విద్యార్థులు రిసెర్చ్ మెథడాలజీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

పరీక్ష విధానం: మొత్తం 140 మార్కులకు కంప్యూటర్ ఆధారిత విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-ఎలో రిసెర్చ్ మెథడాలజీ-70 ప్రశ్నలు-70 మార్కులు, సెక్షన్-బి అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు-70 ప్రశ్నలు-70 మార్కులు ఉంటాయి. పరీక్షలో బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్షలో జనరల్ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే ఇంటర్వ్యూకు అర్హులవుతారు.

పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయవాడ, కడప, విజయనగరం, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, ఒంగోలు, అనంతపురం, కాకినాడ, నెల్లూరు, భీమవరం, తిరుపతి, హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 20.02.2024.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజుచెల్లించడానికి చివరితేది: 19.03.2024.

➥ రూ.2000, రిజిస్ట్రేషన్ ఫీజు ఆలస్య రుసుముతో దరఖాస్తు తేదీలు: 20.03.2024 నుంచి 29.03.2024 వరకు.

➥ రూ.5000, రిజిస్ట్రేషన్ ఫీజు ఆలస్య రుసుముతో దరఖాస్తు తేదీలు: 30.03.2024 నుంచి 06.04.2024 వరకు.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ తేదీలు: 04.04.2024 నుంచి 07.04.2024 వరకు.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 10.04.2024 నుంచి

➥ పరీక్ష తేదీలు: 2024, ఏప్రిల్‌ నెలలో. 

Notification

Fee Payment

Online Appliction

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget