By: ABP Desam | Updated at : 23 Jul 2022 07:41 AM (IST)
పుట్టిన రోజే చావు రోజైంది, కేక్ కట్ చేయిద్దామని తీసుకొస్తుండగా రోడ్డు ప్రమాదం!
Bike Accident: గత పది రోజులుగా తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని స్నేహితులకు తెలిపాడు. ఈ క్రమంలోనే ఆ యువకుడి మిత్రులు కూడా అతడి బర్త్ డేని బాబా చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి అతడితో కేక్ కట్ చేయించాలనుకున్నారు. అయితే పల్లెలో ఉన్న స్నేహితుడిని తీసుకొచ్చేందుకు మరో ఇద్దరు యువకులు బయలు దేరారు. 11 గంటల సమసయంలోనే అతడి ఇంటికి వెళ్లి మాతో రావాలని కోరారు. సరే పదండంటూ అతడూ వారితో వచ్చాడు. ముగ్గురూ పుట్టిన రోజు ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బర్త్ డే బాయ్ ప్రామాలు కోల్పోయిన ఘటన అందరినీ కలచి వేసింది.
కేక్ కట్ చేయించేందుకు తీసుకెళ్దామని...
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణం శ్రీకంఠపురం ఎస్సీ కాలనీకి చెందిన తిప్పన్న, లక్ష్మీనరసమ్మల మూడో కుమారుడు జీవన్ సాయి. అయితే అతడు బేల్దారి పని చేస్తూ కుటుంబానికి సాయంగా ఉంటున్నాడు. శుక్రవారం రోజు అతడి పుట్టిన రోజు కావడంతో.. రాత్రి 12 గంటలకు కేట్ కట్ చేయించాలని స్నేహితులంతా కలిసి ప్లాన్ చేశారు. అన్ని ఏర్పాటు కూడా పూర్తి చేశారు. అయితే బర్త్ డే బాయ్ పల్లెలో ఉండడంతో అతడిని తీసుకొచ్చేందుకు లేపాక్షి మండలం కోడిపల్లికి చెందిన చరణ్, హరి ద్విచక్రవాహనంపై బయలు దేరారు. 11 గంటల ప్రాంతంలో జీవన్ సాయి ఇంటికి చేరుకున్న వాళ్లు.. అతడిని తమతో పాటు రావాల్సిందిగా కోరారు.
అక్కడకు రాగానే రోడ్డు ప్రమాదం..
అందుకు ఒప్పుకున్న జీవన్ సాయి వారితో పాటు బయలుదేరాడు. మార్గమధ్యంలో తన పుట్టిన రోజు వేడుకల గురించి మాట్లాడుకుంటూ ముగ్గురూ బైక్ పై వస్తున్నారు. కోడపల్లి గ్రామానికి చెందిన నయాజ్, గోపాల్ అనే ఇద్దరు వ్యక్తులు తమ గ్రామానికి వస్తుండగా.. ఎదురెదురుగా వస్తున్న వీరి ద్విచక్రవహనాలు ఢీకొన్నాయి. పూలకుంట సమీపంలో ఈ బైక్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న జీవన్ సాయికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు అతడిని హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ చికిత్సపొందుతూ జీవన్ సాయి మృతి చెందాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పుట్టిన రోజు నాడే పైలోకాలకు..
పుట్టిన రోజు నాడే తమ కుమారుడు చనిపోవడాన్ని ఆ తల్లిలదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. చేతికి అంది వచ్చిన కొడుకు అనంత లోకాలకు వెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. అలాగే జీవన్ సాయి స్నేహితులు కూడా.. విలపిస్తూనే ఉన్నారు. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలను చాలా బాగా చేయాలనుకుంటే... ఈ రోడ్డు ప్రమాదం తమ ప్రాణ స్నేహితుడిని మింగేయడం భరించలేకపోతున్నారు. అయితే బర్త్ డే రోజే జీవన్ సాయి చనిపోవడంతో గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.
Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!
Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..
Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?
Kamareddy Bus Accident : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు బోల్తా, 25 మందికి గాయాలు
Krishna Road Accident: కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురికి తీవ్ర గాయాలు - పెళ్లికొడుకు పరిస్థితి విషమం
Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?
Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో
TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?