News
News
X

Man Murder: ఇద్దరు ప్రియులూ ఒకేసారి ఇంటికొచ్చారు, గొడవపడి ఒకరి హత్య! 

Man Murder: అప్పటికై పెళ్లి అయింది. అయినా మరో ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఒకేసారి వారిద్దరూ ఆమె ఇంటికి రావడంతో గొడవ జరిగింది. ఇందులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

FOLLOW US: 

Man Murder: ఓ మహిళకు అప్పటికే పెళ్లి అయింది. అయినా అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.  ఒకరికి తెలియకుండా ఒకరు అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి వెళ్లేవారు. అయితే ఒకరోజూ ఇద్దరూ ఒకే సమయంలో ఆమె ఇంటికి వచ్చారు. ఒకర్ని చూసి మరొకరు ఏంటని అడుగుతూ వాగ్వాదానికి దిగారు. ఇదే వారి మధ్య  పెద్ద గొడవగా మారింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.

ఇద్దరు ప్రియులూ ఒకేసారి ఇంటికొచ్చారు...

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం అల్లవారి పాలెంలో దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. యకునూరు గ్రామానికి చెందిన శ్రీనివాస రెడ్డి ,అల్లవారి పాలెంకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మహిళ గత కొంత కాలంగా అల్లవారి పాలెంకు చెందిన శ్రీ‌కాంత్ రెడ్డి అనే మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. నిన్న రాత్రి ఒకే సమయంలో ఇరువురు ఆమె ఇంటికి రావడంతో వారిద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఇరువురు మధ్య జరిగిన ఘర్షణలో శ్రీనివాసరెడ్డి హత్యకు గురైనట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు.

శ్రీనివాస రెడ్డికి సదరు మహిళకు మనస్పర్థలు..

అయితే ఈ ఘ‌ట‌న పై అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. శ్రీ‌నివాస‌రెడ్డికి స‌ద‌రు మ‌హిళ‌కు మ‌ద్య గత కొంత కాలంగా మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆమె శ్రీనివాస రెడ్డిని దూరంగా పెట్టడం ప్రారంభించింది. అయితే ఆమెను వదిలి ఉండలేని శ్రీనివాస రెడ్డి మహిళను బెదిరించడం ప్రారంభించాడు. అయితే అప్పటికే ఆమెకు అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డితో కూడా సంబంధం ఉండడంతో.. అతడికి విషయాన్ని చెప్పింది. దీంతో శ్రీకాంత్ రెడ్డి బాహాటంగానే శ్రీనివాస రెడ్డిపై విమర్శలు చేయడం ప్రారంభించాడు. తనపై విమర్శలు చేయడం, తన అనుకున్న మహిళతో మరో వ్యక్తి సంబంధం పెట్టుకోవడం జీర్ణించుకోలేకపోయాడు. 

ముందు కత్తితో.. ఆపై రోకలి బండతో కొట్టి!

ఈ క్ర‌మంలోనే శ్రీ‌నివాస రెడ్డి... స‌ద‌రు మ‌హిళ ఇంటికి వెళ్లాడు. అదే స‌మ‌యంలో శ్రీ‌కాంత్ రెడ్డి కూడా ఇంట్లోనే క‌నిపించాడు. దీంతో శ్రీనివాస రెడ్డి వారిద్దరితో గొడవకకు దిగాడు. శ్రీకాంత్ రెడ్డి కూడా కోపంతో ఊగిపోతూ గట్టి గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. పక్కనే ఉన్న కత్తి తీస్కొని దాడి చేశాడు. ఆపై రోకలి బండ తీస్కొని శ్రీనివాస రెడ్డి తలపై బలంగా మోదాడు. తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడికకకడే కుప్పకూలిపోయాడు. క్షణాల్లోనే కన్నుమూశాడు.  ఇంటి నుండి విపరీతమైన అరుపులు, కేక‌లు రావడంతో స్దానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

శ్రీకాంత్ రెడ్డితోపాటు సదరు మహిళ కూడా పరారు..

పోలీసులు రంగంలోకి దిగి విచార‌ణ చేప‌ట్టారు. డాగ్ స్క్వాడ్ తో పాటుగా, క్లూస్ టీం కూడ రంగంలోకి దిగింది. సంఘ‌ట‌న త‌రువాత శ్రీ‌కాంత్ రెడ్డితో పాటుగా మ‌హిళ కూడా పరార‌య్యారు. అయితే ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ కూడ ఉంది. ఇద్ద‌రితో వివాహేత‌ర సంబందం కొన‌సాగిస్తున్న మ‌హిళ భ‌ర్త మాన‌సిక రోగి కావ‌టంతో అత‌న్ని ఇంటిలోనే ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఆమె భ‌ర్త‌కు శ్రీ‌నివాస‌రెడ్డి, శ్రీ‌కాంత్ రెడ్డి ఇద్ద‌రు స్నేహితులు కావ‌టం కొస‌మెరుపు. పోలీసులు జాగిలాలు కూడ శ్రీ‌కాంత్ రెడ్డి ఇంటి స‌మీపంలోకి వెళ్లి ఆగిపోయాయి. దీంతో పోలీసుల కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Published at : 26 Jul 2022 01:22 PM (IST) Tags: Man Murder Man Latest Murder case Man Brutally Murder Krishna Latest Murder Case Woman and Her Boy Friend Murdered Her Old Boy Friend

సంబంధిత కథనాలు

Kadapa News : అక్రమ నిర్మాణాల తొలగింపులో ఉద్రిక్తత, సచివాలయ సిబ్బందిపై దాడి

Kadapa News : అక్రమ నిర్మాణాల తొలగింపులో ఉద్రిక్తత, సచివాలయ సిబ్బందిపై దాడి

Tea Shop Attack : సిగరెట్ దగ్గరకు తెచ్చివ్వలేదని టీ షాపు యజమానిపై దాడి

Tea Shop Attack : సిగరెట్ దగ్గరకు తెచ్చివ్వలేదని టీ షాపు యజమానిపై దాడి

Nellore Police : నెల్లూరు పోలీసులపై చర్యలకు ఎస్సీ కమిషన్ ఆదేశాలు

Nellore Police : నెల్లూరు పోలీసులపై చర్యలకు ఎస్సీ కమిషన్ ఆదేశాలు

Nellore Accident : పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు, పిల్లల్ని వదిలేసి డ్రైవర్ పరారీ

Nellore Accident : పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు, పిల్లల్ని వదిలేసి డ్రైవర్ పరారీ

Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణం, భోజనం పెట్టలేదని భార్యను హత్యచేసిన భర్త!

Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణం, భోజనం పెట్టలేదని భార్యను హత్యచేసిన భర్త!

టాప్ స్టోరీస్

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు