Viral Crime: అదనపు కట్నం తేలేదని కోడల్ని గదిలో బంధించి కోబ్రాను వదిలిన అత్తామామలు - నిజమైన కట్నపిశాచులే !
Kanpur: ఐదు లక్షల కట్నం తేవాల్సి ఉన్నా తేవడం లేదని కోడల్ని ఓ గదిలో బంధించి పామును వదిలారు అత్తామామలు. ఈ ఘటన కలకలం రేపింది.

Dowry Dispute: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కట్నం వివాదం కారణంగా లో ఓ యువతిని ఆమె భర్త, అత్తమామలు గదిలో బంధించి, విషపూరిత పామును వదిలిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన సెప్టెంబర్ 18న కాన్పూర్‌లోని కల్నల్‌గంజ్ ప్రాంతంలో జరిగింది. బాధితురాలు రేష్మా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది,. రు.
రేష్మా 2021 మార్చిలో వివాహం చేసుకుంది. వివాహం అయిన కొద్ది రోజులకే ఆమె భర్త అయాన్ , అతని కుటుంబ సభ్యులు రూ. 5 లక్షల కట్నం డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఇంటి మరమ్మతుల కోసం రూ. 1.5 లక్షలు ఇప్పించినప్పటికీ, వారి డిమాండ్లు ఆగలేదు. రేష్మాను ఆమె మూడేళ్ల కుమార్తె నుంచి వేరు చేసి, సెప్టెంబర్ 18 రాత్రి ఒక పాడుబడిన గదిలో బంధించారు. ఆ గదిలోకి విషపూరిత కోబ్రా పామును వదిలారు. ఆ పాము రేష్మాను కాటేయడంతో ఆమె తీవ్ర నొప్పితో విలవిల్లాడిపోయింది. అయితే ఆమె అత్తమామలు ఆమెను రక్షించకుండా బయట నవ్వుకుంటూ ఆలస్యం చేశారు. అరుపులు చుట్టుపక్కల వారికి వినిపించడంతో వారి సాయంతో ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కాన్పూర్ పోలీసులు ఏడుగురిపై, రేష్మా భర్తతో సహా, హత్యాయత్నం, కట్నం వేధింపుల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 (హత్యాయత్నం) , కట్నం నిషేధ చట్టం కింద కేసు నమోదైంది. పోలీసులు ఈ ఘటనను లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
दहेज़ मे 5 लाख की डिमांड.. बहू क़े खात्मे को खेला खतरनाक खेल, सपेरे से सांप मंगवा.. बहू को कमरे मे बंद कर सांप छोड़ा, साँप ने महिला को काटा, हत्या क़े प्रयास की FIR दर्ज
— TRUE STORY (@TrueStoryUP) September 21, 2025
UP मे कानपुर के कर्नलगंज थाना क्षेत्र से एक दिल दहला देने वाली घटना सामने आई है। दहेज में ₹5 लाख न मिलने पर… pic.twitter.com/MHuL31rVUm
రేష్మాను ఆస్పత్రిలో చేర్పించిన వైద్యులు, ఆమెకు శరీరం నుంచి పాము విషాన్ని తొలగించే ప్రయత్నం చేశారు.
ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ విషమంగా ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కట్నం వేధింపులు, మహిళలపై హింసను నిరోధించేందుకు కఠిన చట్టాల అమలు ,సామాజిక అవగాహన అవసరమని పలువురు అంటున్నారు.
मामला थोड़ा संदेह पैदा करताहै
— Dinesh Chaturvedi (@DineshChat91698) September 21, 2025
महिला को ससुराल वालो ने बंद कमरे में सांप छोड़ा फिर महिलाको सांप ने कटा पर महिला पहले मायके गई फिर अस्पताल सांपने काटा था तो पहले अस्पताल जाती ओर कमरे से कैसे बाहर आई अब सुसराल वालो ने तो गेट खोला नही होगा जिसने खोला होगा महिला उसे मदद मांग सकतीथी🤔





















