News
News
X

Uttarakhand Gang Rape : కదిలే కారులో ఆరేళ్ల బాలికపై అత్యాచారం - ఉత్తరాఖండ్‌లో మరో నిర్భయ !

ఉత్తరాఖండ్‌లో కదిలే కారులో తల్లితో పాటు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.

FOLLOW US: 

Uttarakhand Gang Rape : కారులో లిఫ్ట్ ఇస్తామని ఆశ చూపి తల్లితో పాటు ఆరేళ్ల కుమార్తెపైనా గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఉత్తరాఖండ్‌లో కలకలం రేపుతోంది. కదులుతున్న కారులోనే వారు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎక్కడైనా ఆపితే పోలీసులు చూస్తారని.. కదులుతున్న కారులో పెద్దగా సౌండ్ పెట్టి ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో నిర్బయ తరహాలో జరిగిన రేప్ ఘటన కావడంతో సంచలనంగా మారింది. 

కరెంట్ బిల్లు కట్టలేదని మెసేజ్ వచ్చిందా? కాల్ చేస్తే ఖాతా ఖాళీ!

కదిలే కారులో తల్లీ, కుమార్తెపై లైంగిక దాడి 

ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ప్రాంతానికి చెందిన మహిళ తన ఆరేళ్ల కూతురితో  ప్రార్థనా మందిరానికి వెళ్లి వస్తోంది. తన ఇల్లు కాస్త దూరం కావడంతో నడుచుకూంటూ వెళ్తోంది. అదే సమంయలో ఆ దారి గుండా వెళ్తున్న కారులోని వ్యక్తి వారికి లిఫ్ట్ ఇస్తామని ఆశ చూపారు. సాయం చేస్తామన్నట్లుగా పిలవడంతో వారిని నమ్మిన మహిళ కారు ఎక్కింది. అయితే ఆ కారులో డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి కాకుండా అతని స్నేహితులు కూడా ఉన్నారు. మహిళ  .. తన కుమార్తె సహా కారులో ఎక్కిన తర్వాత వారి పైశాచికత్వం చూపించారు. ఆ చిన్న పిల్లను కూడా వదలకుండా అత్యాచారానికి పాల్పడ్డారు. 

48 గంటల అల్టిమేటం పెట్టిన బీఎస్పీ నేత ఆచూకీ లభ్యం, ఎక్కడున్నారంటే?

అర్థరాత్రి ఓ కాలువ పక్కన వదిలేసిన దుండగులు

అర్థరాత్రి తర్వాత వారిని ఓ కాలువ దగ్గర వదిలి పెట్టి వెళ్లిపోయారు.  ఆ మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంది. సోను అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. ఆ మహిళ షాక్‌లో ఉండటంతో పూర్తి వివరాలు చెప్పలేకపోతోంది. అయితే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పేరును మాత్రం సోను గా చెబుతోంది. పోలీసులు బాధితురాలిని వెంటనే..  వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేర్పించారు. 

నిజామాబాద్ జిల్లాలో సుపారీ హత్యకు ప్లాన్, సర్పంచ్ భర్త కుట్రను భగ్నం చేసిన పోలీసులు

నిందితుల కోసం పోలీసుల సెర్చింగ్

ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాల దృశ్యాలు ఎక్కడైనా దొరుకుతాయేమోనని చూస్తున్నారు. ఇంతవరకూ నిందితుల్ని గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ కే్సు ఉత్తరాఖండ్‌లో కలకలం రేపుతోంది. తల్లితోపాటు ఆరేళ్ల చిన్నారినీ రేప్ చేయడం.. అదీ కూడా కదిలే కారులో ఘాతుకానికి పాల్పడటంతో ఉత్తరాఖండ్ నిర్భయ కేసుగా పరిగణిస్తున్నారు. 

Published at : 27 Jun 2022 07:39 PM (IST) Tags: Crime News Uttarakhand Police Uttarakhand Rape Case Uttarakhand Nirbhaya

సంబంధిత కథనాలు

Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, తల్లీ కొడుకు మృతి!

Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, తల్లీ కొడుకు మృతి!

Cairo church Fire : కైరో చర్చిలో అగ్నిప్రమాదం, 41 మంది సజీవదహనం

Cairo church Fire :  కైరో చర్చిలో అగ్నిప్రమాదం, 41 మంది సజీవదహనం

Naina Jaiswal : నైనా జైస్వాల్ కు ఇన్ స్టాలో వేధింపులు, యువకుడు అరెస్టు!

Naina Jaiswal : నైనా జైస్వాల్ కు ఇన్ స్టాలో వేధింపులు, యువకుడు అరెస్టు!

Lovers Suicide: వాట్సాప్‌లో చాటింగ్, ఆపై పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య - అసలేం జరిగిందంటే !

Lovers Suicide: వాట్సాప్‌లో చాటింగ్, ఆపై పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య - అసలేం జరిగిందంటే !

Tirumala: టీటీడీలో టిక్కెట్ల మోసం - ఇంటి దొంగతో పాటు, మరో ఐదు మంది దళారులు అరెస్టు

Tirumala: టీటీడీలో టిక్కెట్ల మోసం - ఇంటి దొంగతో పాటు, మరో ఐదు మంది దళారులు అరెస్టు

టాప్ స్టోరీస్

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!

మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!