News
News
X

Ramagundam News : సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఏదో చేయక్కర్లేదు.. ఈ విషయాలు తెలుసుకుంటే చాలు !

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేాయలి ? రామగుండం పోలీసులు చెబుతున్న టిప్స్ ఇవిగో

FOLLOW US: 
Share:

Ramagundam News : టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ కాలంలో దొంగలు కూడా తెలివి మీరిపోయారు. కంటికి కనిపించకుండా దోచుకుపోతున్నారు. అవగాహన లేకపోడంతో పెద్ద ఎత్తున  ప్రజలు మోసపోతున్నారు. ఇలాంటి  మోసాల నుంచి ఎలా బయటపడాలో రామగుండం పోలీసులు చబుతున్నారు.  

వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల పేరిట వల.. ఆన్ లైన్ లోన్ ఇస్తామనే ప్రకటనలూ పెద్ద స్కామే !

యువత, మహిళలు ఖాళీగా ఉండే సమయంలో పార్ట్ టైం జాబ్ చేస్తే బాగుంటుందని వీరు కూడా ఆన్ లైన్లో జాబ్స్ కోసం వెతుకుతూ ఉంటారు. స్మార్ట్ ఫోన్ డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో అదే స్థాయిలో ఆన్లైన్లో మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. పార్ట్ టైం జాబ్ అంటూ వచ్చిన మెసేజ్లు , ఆన్లైన్లో లింకులు ఫాలో అయ్యారంటే మీ ఖాతాలో డబ్బులు అన్ని ఖాళీ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. టెక్నాలజీ సహాయంతో ఈజీగా సైబర్ మోసాలకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. చాలా మందికి డబ్బు అత్యవసరం అయినప్పుడు ఆన్లైన్ లోన్ తక్షణ పరిష్కారంగా కనిపిస్తుంది. అయితే, కొంతమంది మోసగాళ్లు  తక్షణ అవసరం నుంచి లాభం పొందడానికి పొంచి ఉంటారనీ ...రుణం తీసుకోవడానికి ముందస్తుగా మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు అన్నారు ..రుణం మంజూరు చేయడానికి డబ్బులు అడగడం అనేది అంటే స్కామ్ అని ..ఎవరూ రెస్పాండ్ కావొద్దని పోలీసులు చెబుతున్నారు. 

ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ! 

• మీకు లాటరి వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.. ఆశపడకండి, అనుమానించండి.

• లాటరి పేరుతో సైబర్ మోసాలు, అప్రమత్తంగా ఉండండి. మీకు ఇలాంటి మెసేజెస్ వస్తే వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. 

• అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి,మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.

• వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.

• తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.

• మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.

• "ఇంస్టాగ్రామ్" లో మీకు తెలిసిన వ్యక్తి ఫోటో వుండి మిమ్మల్ని డబ్బులు పంపమని అడుగుతున్నాడా? మరి ఆ మెసేజి మీకు తెలిసిన వ్యక్తే పంపాడా? తెలుసుకోండని సూచిస్తున్నారు

తాము మోసపోయామని ఏ మాత్రం అనుమానం ఉన్నా.. వెంటనే  NCRP portal (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు.టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కూడా కాల్ చేయవచ్చు. 

ఇటీవలి కాలంలో ప్రతీ రోజూ వందల్లో కేసులు నమోదవతుున్నాయి. వాటిలో కొన్ని ఎవరూ ఊహించనన్ని నేరాలు ఉన్నాయి. 

రామగుండం లోని రామగిరి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడికి వాట్సాప్ లో తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది బాధితుడు ఆ కాల్ లిఫ్ట్ చేసాక అటువైపు ఉన్న అమ్మాయి న్యూడ్ గా ఉండి ఆ కాల్ రికార్డ్ చేసింది డబ్బులు ఇవ్వాలని బెదిరించగా బాధితులు పట్టించుకోలేదు, తర్వాత మరొక వ్యక్తి ఫోన్ చేసి నేను ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ అని  మాట్లాడుతున్నాను మీ మీద కంప్లైంట్ వచ్చింది మీ వీడియో యూట్యూబ్ లో  పెట్టకుండా ఉండాలి అంటే డబ్బులు చెల్లించాలి అంటూ మాయమాటలు చెప్పి బాధితులు వద్ద నుంచి 1,70,000 కొట్టేశారు. ఇలాంటి కారణాలతో బ్లాక్ మెయిల్ చేసే ముఠాలు చాలా ఉన్నాయి. అందుకే పోలీసులు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే చాలా  వరకూ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా బయటపడవచ్చు.   

Published at : 24 Dec 2022 01:33 PM (IST) Tags: Cyber Crimes Cyber Criminals Ramagundam Police Ramagundam

సంబంధిత కథనాలు

హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లిలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్- నలుగుర్ని చితకబాదిన యువకుల గుంపు

హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లిలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్- నలుగుర్ని చితకబాదిన యువకుల గుంపు

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

Dial 100 Saves Life : డయల్ 100కు కాల్ చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి- చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్

Dial 100 Saves Life : డయల్ 100కు కాల్ చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి- చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్

Karimnagar Accident : హెల్మెట్ ధరించినా దక్కని ప్రాణం, రోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్ మృతి

Karimnagar Accident : హెల్మెట్ ధరించినా దక్కని ప్రాణం, రోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్ మృతి

టాప్ స్టోరీస్

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి