అన్వేషించండి

Vizag Crime: లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య కేసు ఛేదించిన పోలీసులు, ఐదుగురి అరెస్ట్

Andhra Pradesh News: అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

Visakhapatnam Girl Student Suicide:  విశాఖపట్నం: లైంగిక వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న కేసును పోలీసులు ఛేదించారు. స్టూడెంట్ సూసైడ్ కేసులో పోలీసులు మంగళవారం నాడు (ఏప్రిల్ 2న) ఐదుగురిని అరెస్ట్ చేశారు. భాను ప్రవీణ్, ఉషారాణి, శంకర్ వర్మ, ప్రదీప్ కుమార్, శంకర్ రావులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ శంకర్ రావు వేధింపుల కారణంగానే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని కుటుంబసభ్యులు, బంధువులు పోలీసులను డిమాండ్ చేశారు.

సారీ నాన్నా అని మెస్సేజ్ చేసి విద్యార్థిని ఆత్మహత్య
విశాఖపట్నం: కుటుంబం పరువు పోతోందన్న భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. టెన్షన్ పెట్టినందుకు క్షమించండి అక్కా, మీ పరువు తీస్తు్న్నందుకు సారీ నాన్నా అంటూ మెస్సేజ్ చేసి ఓ విద్యార్థిని తనువు చాలించింది. విశాఖపట్నంలో ఈ దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులతో కలిసి ఫ్యాకల్టీ తనను లైంగికంగా వేధిస్తున్నారని.. అసభ్యకర, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించారని చనిపోయేముందు చేసిన మెస్సేజ్ లో పేర్కొంది.  

విద్యార్థిని చివరగా రాసిన నోట్ ఇదే..
‘టెన్షన్ పెట్టినందుకు క్షమించండి అక్కా, బావ. ఒక ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనివ్వు అది చాలు. ఏది ఏమైనా నీకు, బావ కి అభినందనలు. అమ్మా, నాన్న, అక్కా, చెల్లి నన్ను క్షమించండి. నా గురించి మార్చిపోండి. నన్ను క్షమించండి. పెంచి పెద్ద చేసినందుకు, బాగోగులు చూసుకున్నందుకు మీకు థ్యాంక్స్. నా చాప్టర్ ఎండ్ అయిపోయింది. నేను ఇంకా బతికుంటే మీకు చాలా సమస్యలు వస్తాయి. అందుకే వెళ్లిపోతున్నా.. అమ్మ, నాన్న ఆరోగ్యం జాగ్రత్త. 

ఇప్పుడు నేను చనిపోతే మీరు కొంతకాలం బాధపడి తరువాత మరిచిపోతారు. కానీ నీ పరువు తీసేస్తున్నందుకు నన్ను క్షమించండి నాన్నా. ఈ కాలేజీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి నాన్నా. ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని అనుకోవచ్చు. వేధిస్తున్న వారిలో ఫ్యాకల్టీ సైతం ఉన్నారు. విద్యార్థులకు మంచి చెప్పాల్సింది పోయి ఫ్యాకల్టీ సైతం విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నారు. నాతో పాటు మరికొందరు అమ్మాయిలను అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని వేధిస్తున్నారు. అటు కాలేజీకి వెళ్లలేక, ఇటు ఎవరికి చెప్పుకోలేక మధ్యలో నలిగిపోతున్నాం. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మాలో ఎవరో ఒకరు చావాలి. అప్పుడే సమస్య బయటకు తెలిసి, మిగతావారికైనా న్యాయం జరుగుతుంది. నన్ను క్షమించండి నాన్నా’ అంటూ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థిని మెస్సేజ్ చేసి కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన కూతురి ఆత్మహత్య విషయం చెప్పకుండా, మిస్సింగ్ అని సమాచారం ఇచ్చారని, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందని విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget