Visakha News : విశాఖ కోర్టు సంచలన తీర్పు, పోక్సో కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష
Visakha News : పోక్సో కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడికి 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించింది.
Visakha News : విశాఖ కోర్టు పోక్సో కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధించింది. 2014లో గోపాలపట్నం ప్రాంతంలో 9 సంవత్సరాల బాలిక వేడుక చూడడానికి వెళ్లి 10 నిమిషాలలో ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. తాను ఇంటికి వస్తుండగా హేమంత్ కుమార్ వ్యక్తి తన చెయ్యి పట్టుకుని దగ్గరలో ఉన్న రూమ్ లోకి తీసుకుని వెళ్లి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. తాను తప్పించుకొని పారిపోయి వచ్చినట్లు చెప్పగా బాలిక తల్లి గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గోపాలపట్నం పోలీసులు పోక్సో కేసు రిజిస్టర్ చేసి నిందితుడైన బోయడాపు హేమంత్ కుమార్(23 సంవత్సరాలు) అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.
10 సంవత్సరాల జైలు శిక్ష విధింపు
ఈ కేసు విచారించిన కోర్టు నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించలేని పక్షాన అదనంగా మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధించింది. నిందితుడికి కఠినంగా శిక్ష పడేటట్లు చేసిన స్పెషల్ పీపీ కరణం కృష్ణరావు, దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్ నరసింహారావు, కోర్టు కానిస్టేబుల్ ను పోలీస్ కమిషనర్ సీహెచ్. శ్రీకాంత్ అభినందించారు.
Also Read : Godavarikhani Ganja : రూటు మార్చిన కేటుగాళ్లు - గంజాయిని లిక్విడ్ లాగా మార్చి అమ్మేస్తున్నారు!
గంజాయి రవాణా కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష
గంజాయి అక్రమ రవాణా కేసులో పట్టుబడ్డ వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది హైదరాబాద్ నాంపల్లి కోర్టు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల బృందం 2020 ఆగస్ట్ నెలలో విజయవాడ హైదరాబాద్ మీదుగా వెళ్తోన్న ఓ ట్రక్కులో 1427 కేజీల గంజాయిని తరలిస్తున్నారని సమాచారం మేరకు పంతంగి టోల్గేట్ వద్ద లారీ పట్టుకున్నారు. 25 ఏళ్ల నదీం అనే యువకుడిని ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. NDPS Act లో 20 ఏళ్ల శిక్ష పడటం ఇదే మొదటిసారి.
Also Read : Suryapet News : హైదరాబాద్‌లో ఇల్లాలు, సూర్యాపేటలో ప్రియురాలు - డాక్టర్‌బాబుకు బడిత పూజ