అన్వేషించండి

Suryapet News : హైదరాబాద్‌లో ఇల్లాలు, సూర్యాపేటలో ప్రియురాలు - డాక్టర్‌బాబుకు బడిత పూజ

పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు అయినా అదనపు కట్నం కోసం భార్యను వేధించి విడాకుల వరకూ వెళ్లాడో డాక్టర్. కోర్టులో వివాదం ఉండగానే సీక్రెట్ గా మరో యువతిని పెళ్లి చేసుకుని సూర్యాపేటలో మకాంపెట్టాడు.

Suryapet News : ఆయనో క్యాన్సర్ స్పెషలిస్ట్ కానీ క్యారెక్టర్ మాత్రం వరస్ట్. క్యాన్సర్ డాక్టర్(Cancer Doctor) కాస్తా చీటర్ గా మారాడు. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా సీక్రెట్ గా మరో యువతితో మకాం పెట్టాడు. ఇంట్లో ఇల్లాలిని వదిలి, బయట ప్రియురాలితో యవ్వారం సాగిస్తున్నాడు. ప్రియురాలి మోజులో తనకు పెళ్లాం పిల్లలున్న సంగతే మరిచాడు. ఆ చీటర్ మొగుడికి భార్య బడిత పూజ చేసింది. ఆ డాక్టర్ చేసిన ట్రీట్మెంట్ వికటించింది. ఆస్పత్రిలో కాదు వారి ఫ్యామిలీలో. ఆ ట్రీట్మెంట్ వికటించడంతోనే సారు వారికి దేహశుద్ధి చేశారు. ఓ విదంగా చెప్పాలంటే పాపానికి ప్రాయశ్చిత్తమిది. 

Suryapet News : హైదరాబాద్‌లో ఇల్లాలు, సూర్యాపేటలో ప్రియురాలు - డాక్టర్‌బాబుకు బడిత పూజ

చీటింగ్ డాక్టర్ 

ఖమ్మం పట్టణానికి చెందిన భాను ప్రకాష్ నాయక్ కి హైదరాబాద్(Hyderabad) కు చెందిన ప్రియాంకతో 2012లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడేళ్ల కొడుకు, ఐదేళ్ల కూతురున్నారు. అల్లుడు డాక్టర్ గా కొలువు వెలగ బెడుతున్నాడు కదా అనీ, పెళ్లికి కట్నంగా సుమారు 10 లక్షల నగదు, 30 తులాల బంగారం సమర్పించారు ప్రియాంక పేరెంట్స్. అంతేకాదు అదనపు కట్నంగా మరికొంత ఆస్తిని ముట్టజెప్పారు. అయినా ఇతగాడికి కట్నం దాహం తీరలేదు. అడిగినప్పుడల్లా డబ్బిస్తుండడంతో అత్తింటి వారిని కూడా క్యాన్సర్ రోగుల లిస్ట్ లో చేర్చుకున్నాడీ కమర్షియల్ డాక్టర్. రోగి స్కానింగ్ రిపోర్ట్ చూసి బిల్లు వసూలు చేసినట్టు, సమస్య సాకుగా చూపుతూ మామ దగ్గర డబ్బులు పిండడం మొదలెట్టేశాడు క్యారెక్టర్ లెస్ అల్లుడు. దాంతో భర్త వైఖరికి విసుగుచెందిన భార్య కొన్నాళ్లుగా కమర్షియల్ మొగుడిని దూరం పెట్టింది. ఏనాడైనా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోయిందా అని సమయం కోసం ఎదురు చూస్తుంది. 

ఫ్యామిలీ కోర్టు పరిధిలో కేసు 

ప్రస్తుతం దంపతుల మధ్య వివాదం ఫ్యామిలీ కోర్టు(Family Court) పరిధిలోకి వెల్లింది. కొంతకాలంగా దంపతులకు కౌన్సిలింగ్ జరుగుతూనే ఉంది. కౌన్సిలింగ్ తో భర్త దారికొస్తాడనుకుంటే, వంకర బుద్దిని బయట పెట్టుకున్నాడు. వివాదం కోర్టులో ఉండగానే విడాకులు ఇవ్వకుండానే మరో యువతితో యవ్వారం మొదలెట్టాడు భాను ప్రకాష్. ఆమెకు మాయమాటలు చెప్పి రహస్యంగా మూడేళ్ల క్రితం పెళ్లికూడా చేసుకున్నాడు. ఎవరికీ ఏ అనుమానం రాకుండా ఆమెతో సూర్యాపేటలో మకాంపెట్టాడు. 

భర్తకు బడిత పూజ 

భర్తకు రెండో పెళ్లైన విషయం తెలుసుకున్న ప్రియాంక తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సూర్యాపేట పట్టణం అంజనాపురంలో కాపురం పెట్టిన భాను ప్రకాష్ ఇంటికి వెళ్లింది. అక్కడ రెండో భార్యతో గదిలో ఉండగా రెడ్ హ్యా౦డెడ్ గా పట్టుకుంది. చీటింగ్ చేసిన భర్తకు దేహశుద్ధి చేసింది. అంతేకాదు రెండో భార్యనూ చితక బాదింది. బంధువులంతా కలిసి ఆ దంపతుల వీపు విమానం మోత మోగించారు. గొడవ పెద్దది కావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వివాదం సద్దుమణిగించారు. దంపతుల మధ్య వివాదం కోర్టు పరిధిలో ఉండడంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా కోర్టు నిబంధనలు ఉల్లంఘించి రెండో పెళ్లి చేసుకున్న భాను ప్రకాష్ పై చీటింగ్ కేసు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. భార్య పిల్లల్ని వదిలి పెళ్లిళ్ల(Marriage) మీద పెళ్లిళ్లు చేసుకుంటూ తనను నమ్మి వచ్చిన వారిని వీధిన పడేస్తున్నారు. పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉన్నామనే సోయి మరిచి నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చీటర్స్ ను అత్యంత కఠినంగా శిక్షించాలని బాధుతులు కోరుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget