అన్వేషించండి

Visakha News: అనుమానంతో ప్రేయసిన చంపేసి పోలీసులకు లొంగిపోయాడు - విశాఖలో యువకుడి దుశ్చర్య

Visakha News: తనను ప్రేమిస్తున్న అమ్మాయి మరో యువకుడితో చనువుగా ఉంటోందనే కోపంతో.. ప్రియురాలిని గొంతు నులిమి చంపాడో ప్రియుడు. అనంతరం నేరుగా పోలీసుల ఎదుటకు వెళ్లి లొంగిపోయాడు. 

Visakha News: విశాఖపట్నం బీచ్ లో దారుణం జరిగింది. తాను ప్రేమిస్తున్న అమ్మాయి మరో యువకుడితో చనువుగా ఉంటోందని ఆమెను చంపానుకున్నాడు. బీచ్ కు రమ్మని చెప్పి.. అర్ధరాత్రి పూట గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీసులు ఎదుటకు వెళ్లి లొంగిపోయాడు. 

విశాఖపట్నానికి చెందిన శ్రావణి, గోపాల్ అనే ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరూ చెట్టాపెట్టాలేసుకొని తరిగేవారు. ఈ క్రమంలోనే శ్రావణి మరో అబ్బాయితో మాట్లాడుతోంది. అతనితో శ్రావణి చనువుగా ఉండడాన్ని గోపాల్ జీర్ణించుకోలేక పోయాడు. తనను ప్రేమిస్తున్నట్లు చెప్పి మరో యువకుడితో తిరుగుతూ తనను మోసం చేస్తుందని భావించాడు.

అలాంటి అమ్మాయిని ఎలాగైనా సరే మట్టుపెట్టాలనుకున్నాడు. ఈక్రమంలోనే ఆమె హత్యకు ప్లాన్ వేశాడు. శుక్రవారం రోజు అర్థరాత్రి గోకుల్ పార్క్ బీచ్ వద్దకు రమ్మని చెప్పాడు. కాసేపు ఆమెతో మాట్లాడిన అతడు... ఒక్కసారిగా ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత గోపాల్ నేరుగా గాజువాక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వారం రోజుల క్రితం ప్రియుడి పీక కోసిన ప్రియురాలు

గోకవరం గ్రామానికి చెందిన ఒమ్మి నాగశేషు(25) తాపీ పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. ఇతనికి ఏడాది క్రితం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన అరుణతో వివాహం అయ్యింది. ఈ క్రమంలోనే తాపీ పని చేసుకునే క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంకు చెందిన కుర్లు డిబేరా అనే యువతితో పరిచయం ఏర్పడిరది. హతుడు నాగశేషు, డిబేరాల మధ్య మధ్య గత ఏడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అదికాస్త వివాహేతర సంబధానికి దారితీయగా డిబేరా నాగశేషుకు రూ.2 లక్షల నగదు, బంగారు గొలుసు ఇచ్చింది. అది ఇవ్వాలని గత కొంతకాలంగా ఆమె నాగశేషును అడుగుతున్నా ఇవ్వడం లేదని, అంతేకాకుండా వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలోనే తన డబ్బు, గొలుసు వెంటనే ఇవ్వాలని డిబేరా డిమాండ్‌ చేసినా అతని నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో చంపాలని నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

కర్ర, కత్తిపీట వెంట తెచ్చుకుని మరీ హత్య

హతుడు నాగశేషుపై విపరీతంగా ఆవేశంతో రగిలిపోయిన డిబేరా రాజవొమ్మంగి ప్రాంతానికి చెందిన శివన్నారాయణ అనే యువకుడితో కలిసి బుధవారం అర్ధరాత్రి తాపీమేస్త్రి అయిన ఒమ్మి నాగశేషు నిద్రిస్తున్న ఇంటి వద్దకు వచ్చిందని పోలీసులు చెప్పారు. నాగశేషు ఇంటి మేడపై నిద్రిస్తున్నాడని అప్పటికే డిబేరాకు తెలియడంతో నేరుగా పైకి ఎక్కి నిద్రిస్తున్న నాగశేషుపై డిబేరా, ఆమె వెంట వచ్చిన శివన్నారాయణ దాడి చేశారు. ఆపై వెంట తెచ్చుకున్న కత్తిపీటతో తీవ్రంగా గాయపరిచి, నాగశేషు గొంతుకోసే ప్రయత్నం చేశారు.

తీవ్రగాయాలపాలైన హతుడు పెద్దపెద్ద కేకలు వేయడంతో అక్కడి నుంచి డిబేరా, శివన్నారాయణ పారిపోయారు. దీంతో హతుని తల్లి గంగతోపాటు స్థానికులు డాబాపైకి వచ్చి చూసేసరికి తీవ్ర రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న నాగశేషును 108లో గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి మరింత విషమించడంతో రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై నాగశివబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నార్త్‌ జోన్‌ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అర్ధరాత్రి మృతుడి హాహాకారాలు విన్న స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యామని తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Embed widget