Crime News: రూ.40వేలు బ్యాంక్ లోన్ తీసుకుని మరీ మరదల్ని హత్య చేయించాడు - కారణమేంటో తెలుసా ?
UP News: ఓ వ్యక్తి భార్య సోదరితో వివాహేదర బంధం పెట్టుకున్నాడు. ఆమె తర్వాత రివర్స్ అయి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. చివరికి ఓ హత్యకు ఇది దారి తీసింది.

UP man takes Rs 40 000 bank loan to give supari for gang rape murder of sister in law: యూపీలోని మీరట్ లో ఓ మహిళను కొంత మంది గ్యాంగ్ రేప్ చేసి చంపేసి.. పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేశారు. పెద్దగా కష్టపడకుండానే హంతకుల్ని పట్టుకున్నారు. వారు ఆ పని ఎందుకు చేశారో తెలుసుకున్న తర్వాత పోలీసులు మరింతగా ఆశ్చర్యపోయారు.
మీరట్ లో ఉండే అశీష్ కుమార్ తన భార్య సోదరితో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ గుట్టుగా కొన్నాళ్లు ఈ వ్యవహారం సాగించారు. అయితే తర్వాత వారి మధ్య గొడవలు వచ్చాయి. డబ్బు కోసమో.. మరో అంశంలోనే ఇద్దరి మధ్య తేడాలు రావడంతో ఆ మరదలు.. తనతో శారీరక సంబంధం పెట్టుకున్న బావను బెదిరించడం ప్రారంభించింది. చివరికి ఆశీష్ కుమార్ తన మరదల్ని వదిలించుకోవాలనుకున్నాడు. మాములుగా అయితే వదిలించుకున్నాడు.. కానీ ఆమె వదలనంటోంది కాబట్టి శాశ్వతంగా వదిలించుకోవాలనుకున్నాడు. అందుకే కొత్త ప్రయత్నం చేశాడు.
కాల్ రికార్డులు.. సీసీ ఫుటేజీ సాక్ష్యాలతో మొత్తం విశ్లేషించిన పోలీసులకు కేసు మొత్తం ఆశీష్ దగ్గరకు చేరడంతో ఆయనను అరెస్టు చేశారు. అయితే సుపారీ కోసం బ్యాంకులో లోన్ తీసుకోవడమే వారిని ఆశ్చర్యపరిచింది. అప్పు తీసుకుని మరీ మరదల్ని హత్య చేయించిన తీరు చూసి వారు ఆశ్చర్యపోయారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

