By: ABP Desam | Updated at : 23 Apr 2022 05:27 PM (IST)
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థులు మృతి
అమెరికాలోని ఇల్లినాయిస్ జరిగిన రోడ్డు ప్రమాదంలో ( US Road Accident ) ఇద్దరు తెలుగు విద్యార్థులు సహా ముగ్గురు మృతి ( Two Telugu students Died ) చెందారు. ఇల్లినాయస్ వారే టౌన్ నుంచి ఈస్ట్ కేప్‌కు వేగంగా వెళుతున్న ఫియట్ కారు ( Fiat Car ) అదుపుతప్పి సెంటర్ లైన్ దాటి పక్కరోడ్డుపైకి దూసుకువెళ్లి ఆ రోడ్డుపై వస్తున్న టయోటా కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫియట్ కారు నడుపుతున్న డ్రైవర్ మారీ మ్యూనియర్ తోపాటు అందులో ప్రయాణిస్తున్న వంశీ పెచ్చెట్టి ( Vamsi ) , టయోటా కారు నడుపుతున్న పవన్ స్వర్ణ ( Pavan Swarna ) అక్కడికక్కడే మృతి చెందారు.
Crash kills 2 SIU students, Missouri woman https://t.co/YTPl2YX75p
— WJPF (@WJPFNews) April 22, 2022
పోలీసులు భద్రత కల్పించడంలేదు, నాకేదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? : వివేకా డ్రైవర్ దస్తగిరి
టయోటా కారులో ప్రయాణిస్తున్న యశ్వంత్ ఉప్పలపాటి ( Yaswant Uppalapati ) , కాకుమాను కార్తీక్ ( Kakumanu Karteek ) , డోర్న కల్యాణ్‌ల ( Dorna Kalyan ) కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించారు. వీరి ప్రాణాలకు ఏమీ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఐదుగురు విద్యార్థులు కాబండేల్ టౌన్‌లోని సదరన్ ఇలినాయిస్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నారు. నలుగురు కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులు చేస్తూండగా.. మరొకరు సివిల్ ఇంజినీరింగ్ కోర్సు చేస్తున్నారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో.. అక్కడి పోలీసులు రోడ్డుని మూడు గంటల పాటు మూసేశారు.
ఉక్రెయిన్ యుద్ధం, ఢిల్లీ అల్లర్ల వార్తలపై మార్గదర్శకాలు - మీడియా సంస్థలకు కేంద్రం సూచనలు !
ఈ ప్రమాదంపై ఎస్‌ఐయు యూనివర్సిటీ ( SIU )చాన్సలర్ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు కుటుంబసభ్యులను కోల్పోవడం బాధాకరమన్నారు. గాయపడిన ముగ్గురికి అన్ని రకాలగా సాయం అందించేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించారు. మంచి భవిష్యత్ ఉన్న ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో అమెరికాలోని భారతీయ సంఘాలు విచారం వ్యక్తం చేశాయి. వారి మృతదేహాలను స్వదేశం పంపించేందుకు సాయం చేసేందుకు ఎన్నారైలు సాయం చేస్తున్నారు. మరో వైపు గాయపడిన వారికి అవసరమైన సాయం చేసేందుకు కూడా తెలుగు సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.
Amalapuram Violence : పోలీసుల వలయంలోనే అమలాపురం, మరో 46 మందిపై కేసు, ఎఫ్ఐఆర్ లో ప్రముఖుల పేర్లు
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు
Karimnagar News : కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు
Nellore Knife Attack : నెల్లూరులో దారుణం, పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి
Hyderabad News : సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసు, వెలుగులోకి సంచలన విషయాలు
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!