Kothagudem: బాలికపై యువకుడు రేప్.. వీడియో తీసిన మరో వ్యక్తి, పిన్ని ఇంటికి తీసుకెళ్లి మరో అత్యాచారం
అశ్వారావుపేటలో మైనర్‌పై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడగా, మరో యువకుడు సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహిళలు, యువతులు, మైనర్ బాలికలపై లైంగిక దాడులు ఆగడం లేదు. తాజాగా తెలంగాణలో రెండు ఘటనలు జరిగాయి. అయితే, ఈ ఘటనలు గతంలోనే జరగగా తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో మళ్లీ ఆడపిల్లలపై లైంగిక దాడుల విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఓ మైనర్ బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడగా.. మరో యువకుడు ఆ ఘటనను వీడియో తీయడం గమనార్హం. మరోవైపు, హైదరాబాద్ బంజారాహిల్స్‌లోనూ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.
అశ్వారావుపేటలో మైనర్‌పై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడగా, మరో యువకుడు సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక గత నెల 30వ తేదీన చర్చికి వెళ్లి రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఒంటరిగా ఇంటికి వస్తుండగా.. ఈ ఘటన జరిగింది. అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడు ఆమెను బలవంతంగా సమీపంలోని పాడు బడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మైనర్ బాలికపై లైంగిక దాడి పాల్పడుతున్న సమయంలో అదే గ్రామానికి మరో యువకుడు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు.
Also Read: హైటెక్‌గా భారీ వ్యభిచార దందా.. 75 మందిని పెళ్లి చేసుకున్న యువకుడు.. నిజాలు తెలిసి అవాక్కైన పోలీసులు
ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బాలికను వారు బెదిరించారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు యువకులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.
Also Read: ఆ ఫోటోకు టెంప్ట్ అయిన గుంటూరు యువకుడు.. రూ.1.20 కోట్లు హుష్‌కాకీ.. బాధితుడు లబోదిబో..
బంజారాహిల్స్‌లోనూ..
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోనూ అత్యాచార ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ బాలికను బలవంతంగా అత్యాచారం చేసిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిలింనగర్‌లోని వినాయకగనర్ బస్తీలో నివసించే మహేష్ అలియాస్ కృష్ణ చైతన్య అనే 20 ఏళ్ల వ్యక్తి, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అదే బస్తీలో నివసించే 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని(16) గత నెల నుంచి ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఆ తర్వాత ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. గత నెల 14న మహేష్ తన బైక్‌పై బాలికను తన పిన్ని ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా రేప్ చేశాడు. రెండు రోజుల క్రితం బాలిక ఏడుస్తుండగా తండ్రి ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో తండ్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు మహేష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.