By: ABP Desam | Updated at : 02 May 2023 08:19 PM (IST)
చంద్రగిరిలో దొంగల దర్జా
తిరుపతి జిల్లాలో దొంగలు రెచ్చి పోతున్నారు. వేసవి కాలం వస్తేనే దొంగల బెడదతో ప్రజలు భయంతో వణికి పోతున్నారు. ఉక్కపోత భరించలేక ఇంటి ముందు, డాబా మీద కుటుంబం మొత్తం నిద్రపోతుంటే ఇంట్లో చొరబడి చోరీలు చేస్తుంటాయి కొన్ని ముఠాలు. ఒంటరిగా వ్యక్తులు ఉన్న ఇళ్ళతో పాటుగా, తాళాలు వేసిన ఇళ్ళను టార్గెట్ గా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా తాళాలు వేసిన మూడు ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు, ఉన్నదంతా దోచుకుని, అక్కడే దర్జాగా స్నానం చేసి మరి సొమ్ముతో ఉడాయించిన ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుపతి జిల్లా చంద్రగిరి కొత్తపేటలోని శ్రీశ్రీ నగర్ లో కాపురం ఉంటున్న ఈశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం అనంతపురంకు వెళ్లింది.. ఐతే పక్కా సమాచారంతో సోమవారం అర్థరాత్రి ఆమె ఇంటి తాళాలు పగులగొట్టి చోరబడిన దొంగలు, కబోర్డులో దాచి ఉంచిన నగలు దోచుకున్నారు. అలాగే విజయనగర్ కాలనీకి చెందిన సుమతి తాళాలు వేసుకుని మేడపై నిద్రిస్తుండగా, ఇంటి తాళాలు పగులగొట్టి చోరికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా సుమతి ఎదురుగా నివాసం ఉంటున్న మేఘన ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్లింది. మేఘన ఇంట్లో కూడా చొరబడిన దొంగలు సొమ్ముతో పాటుగా, బంగారు నగలను దోచుకెళ్లారు.
మంగళవారం ఉదయం ఇంటి తాళాలు బద్ధలుకొట్టి ఉండడాన్ని గమనించి, ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. ఐతే యజమాని ఫిర్యాదుతో సంఘటన స్ధలంకు చేరుకున్న చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.. ఎంత నగదు, బంగారం చోరీ జరిగిందన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో సంఘటన స్ధలంలో క్లూస్ ని సేకరించారు.. మూడు ఇళ్ళల్లో దొంగతనాలు చేసిన దుండగులు శ్రీశ్రీనగర్ లో నివాసం ఉంటున్న ఈశ్వరి ఇంటి సమీపంలో స్నానం చేసి టవల్, సోప్ అక్కడి వదిలి వెళ్లారు..
Delhi murder: ఢిల్లీలో నడిరోడ్డుపై అందరూ చూస్తూండగానే బాలిక హత్య - నిందితుడు అరెస్ట్ !
Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !
Gang Arrest : ఐటీ అధికారుల పేరుతో బంగారం దోపిడీ - గ్యాంగ్ ను పట్టుకున్న పోలీసులు ! ఈ స్కెచ్ మమూలుగా లేదుగా
Kurnool News: కుమారులు అంటే భయం- భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిన భార్య
Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు
Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి
‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్