By: ABP Desam | Updated at : 30 Nov 2021 01:22 PM (IST)
Alwal
ఖాళీ స్థలంలో పార్కు చేసిన కారులో సోమవారం నాడు విజయ్ భాస్కర్ రెడ్డి మృతదేహం లభ్యమైంది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలోనే విజయ్ భాస్కర్ రెడ్డి హత్యకు గురయ్యారని పోలీసులు భావిస్తున్నారు.
హైదరాబాద్‌లో మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణమైన హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. అల్వాల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన కారులోనే దుండగులు హతమార్చినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోని తిరుమల గిరిలో పెద్ద కమేళ ఆర్టీసీ కాలనీ ప్రధాన రహదారిలో మిలిటరీకి సంబంధించిన ఖాళీ స్థలంలో పార్కు చేసిన కారులో సోమవారం నాడు విజయ్ భాస్కర్ రెడ్డి మృతదేహం లభ్యమైంది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలోనే విజయ్ భాస్కర్ రెడ్డి హత్యకు గురయ్యారని పోలీసులు భావిస్తున్నారు. కారులో రక్తపు మరకలు, మృతదేహంపై గాయాలను బట్టి చూస్తే హత్య అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
క్లూస్ టీం సహాయంతో మరణించిన వ్యక్తి నుండి ఆధారాలు సేకరించారు. నోరు ముక్కు వద్ద గాయాలు కావడం, చెవి వెనుక భాగం నుండి రక్తస్రావం జరుగుతుండడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విజయ భాస్కర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి 200 మీటర్ల దూరంలో విజయ్ కుమార్‌కు సంబంధించి సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయ్ భాస్కర్‌ను చంపేసి కారులో పడేసినట్లు ఆధారాలను బట్టి తేల్చారు.
అయితే, పోలీసుల ప్రాథమిక విచారణలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు ఓ స్థలం రిజిస్ట్రేషన్ కోసం విజయ్ భాస్కర్ రెడ్డి తన ఇంటి నుంచి బయలుదేరాడు. రూ.10 లక్షల నగదును ఆయన తన ఇంట్లో నుంచి తీసుకువెళ్లి తిరిగి రాలేదు. ఈ క్రమంలో కారులోనే దుండగులు కత్తితో విజయ్ రెడ్డి మెడపై కత్తితో పొడిచి చంపారు. పోలీసులు కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. స్థలం రిజిస్ట్రేషన్‌కు వ్యవహరించిన మధ్యవర్తులే చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. విజయ్ భాస్కర్‌కు గత కొద్ది రోజులుగా ఆస్తి విషయంలో తన బంధువులతో గొడవలు జరుగుతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతుడి బంధువు తోట నరేందర్ రెడ్డి సహా మరో వ్యక్తి అబ్రహం అనే వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని తిరుమలగిరి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇద్దరు అనుమానితులను వారు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గతంలో కొద్ది నెలల క్రితం కూకట్ పల్లిలోనూ నెల్లూరుకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని దుండగులు హతమార్చిన సంగతి తెలిసిందే.
Also Read: MLC Election: వారికి విమానాలు.. మాకు బస్సులా.. ఖమ్మం టీఆర్‌ఎస్ పార్టీలో విభేదాలు
Read Also: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్
DK SrinivaS Arrest : డ్రగ్స్ కేసులో డీకే ఆదికేశవులు కుమారుడు - బెంగళూరులో అరెస్ట్ చేసిన ఎన్సీబీ !
Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి
Goa News: దొంగల నయా ట్రెండ్- ఇల్లంతా దోచేసి, లవ్ లెటర్ రాసి పరార్!
Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి