అన్వేషించండి

Old City Murder: కారం చల్లి కత్తులతో నరికి, స్నేహితుల మధ్య గొడవే హత్యకు కారణమా?

Old City Murder: హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు హత్యచేశారు. కళ్లల్లో కారం చల్లి కత్తులతో నరికి హత్య చేశారు.  

Old City Murder: ఓ వ్యక్తిని ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి చంపారు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్నేహితుల మధ్య జరిగిన గొడవ వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి పేర షాకీర్ గా పోలీసులు గుర్తించారు. అతడు భవాని నగర్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు వెల్లడించారు. 

వ్యక్తి హత్య కేసులో స్నేహితులపై అనుమానం

భవాని నగర్ ప్రాంతంలో నివాసం ఉండే 30 ఏళ్ల షాకీర్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతడికి స్నేహితుల మధ్య కొన్ని రోజుల క్రితం గొడవ జరిగింది. ఇది మనసులో పెట్టుకున్న షాకీర్ స్నేహితులు అతడిపై కక్ష పెట్టుకున్నారు. ఈ క్రమంలో షాకీర్ టాటా ఏస్ వాహనంలో బ్యాటరీల లోడ్ తో సంతోష్ నగర్ నుండి బండ్ల గూడ వైపు వెళ్తుండగా అతడిని ముగ్గురు వ్యక్తులు వెంబడించారు. చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఆర్ డీఎల్ రోడ్డు వరకు రాగానే అతడిని వారు అడ్డగించారు. షాకీర్ కళ్లలో కారం చల్లారు. అనంతరం వారి వెంట తెచ్చుకున్న కత్తులో షాకీర్ పై విచక్షణా రహితంగా దాడి చేశారు. ముగ్గురు వ్యక్తుల దాడిలో షాకీర్ గాయాలపాలై తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయాడు. షాకీర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో ఏవైనా సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయా అనే ఆధారాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం షాకీర్ తో గొడవ పడ్డ స్నేహితులే షాకీర్ ను అడ్డగించి హతమార్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం ఇలాంటి ఘటనే కొత్తగూడెంలో జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు తన స్నేహితుడిని సిమెంట్ ఇటుక, రాడ్డుతో తీవ్రంగా కొట్టి చంపాడు. గాజులరాజం బస్తీకి చెందిన బడికెల సందీప్ అదే ప్రాంతానికి చెందిన పల్లం సాయికుమార్ మంచి మిత్రులు. ఇద్దరూ కలిసి బడ్డీ కొట్టు వద్దకు వెళ్లి అక్కడ సిగరెట్ తాగారు. తర్వాత అక్కడి సందీప్ వెళ్లిపోతుండగా.. డబ్బులు ఇవ్వు అంటూ బడ్డీ కొట్టు రాకేశ్ అడిగాడు. తర్వాత ఇస్తాలే అంటూ సందీప్ సమాధానం ఇచ్చాడు. ఇప్పటికే చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉందని రాకేశ్ అడగడంతో పక్కనే ఉన్న సాయి కుమార్ ఎందుకు రా డబ్బులు ఇచ్చేసేయ్ అన్నాడు. ఈ విషయంలో వారి మధ్య వాదన జరిగింది. నువ్వేంట్రా నాకు చెప్పేది అంటూ సందీప్ అతడి స్నేహితుడు సాయి కూమార్ ను కొట్టాడు. తర్వాత సాయి కుమార్ కూడా చేయి చేసుకున్నాడు. అలా వారిద్దరూ తీవ్రంగా కొట్టుకున్నారు. అదే క్రమంలో సాయి కుమార్ సందీప్ పై తీవ్రంగా దాడి చేశాడు. దీంతో సందీప్ కింద పడిపోగా.. అక్కడ పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకతో సందీప్ తలపై సాయికుమార్ బలంగా కొట్టాడు. మంచి చెబితే తననే కొట్టాడన్న ఆవేశంలో సందీప్ రక్తపు మడుగులో ఉన్నా కనికరం లేకుండా మరోసారి ఇటుకతో బలంగా కొట్టాడు. సాయికుమార్ దాడిలో సందీప్ చెవి, ముక్కుల్లోంచి తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయాడు. 

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget