అన్వేషించండి

Raids On Clinics: నగరంలో క్లినిక్స్‌పై వైద్యాధికారుల దాడి - 50 మందికి పైగా నకిలీ డాక్టర్ల గుర్తింపు

Telangana News: హైదరాబాద్, మేడ్చల్ పరిధిలోని పలు క్లినిక్స్‌లో వైద్య మండలి అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు 50 మందికి పైగా నకిలీ వైద్యులను గుర్తించి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Medical Officers Raids On Clinics In Hyderabad: తెలంగాణ వైద్య మండలి అధికారులు పలు క్లినిక్స్‌పై దాడి చేశారు. హైదరాబాద్, మేడ్చల్ (Medchal) పరిధిలోని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఐడీపీఎల్, చింతల్, షాపూర్‌నగర్‌లలో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. 8 మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి ఒకేసారి తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తోన్న పలు క్లినిక్స్‌ను సీజ్ చేశారు. కొందరు నకిలీ వైద్యులు ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని అధికంగా యాంటీ బయాటిక్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక, వారికి అనుసంధానంగా మెడికల్‌ షాపులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. దాదాపు 50 మంది నకిలీ వైద్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఇద్దరిని జైలుకు పంపినట్లు వెల్లడించారు. తనిఖీల్లో డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి, డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌, డాక్టర్‌ సన్నీ డేవిస్‌, డాక్టర్‌ ఇమ్రాన్‌ అలీ, డాక్టర్‌ కే. విష్ణు, పాండు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నకిలీ వైద్యులు, క్లినిక్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.

నకిలీ ఔషధాలు స్వాధీనం

మరోవైపు, తప్పుడు ప్రకటనలతో ఔషధాలు తయారు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తోన్న తయారీ సంస్థలపైనా తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన అధికారులు.. కొన్ని చోట్ల సోదాల్లో నకిలీ ఔషధాలు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో న్యూమోనియాకు ఆయుర్వేద ఔషధం పేరుతో తయారు చేస్తోన్న ఓ ఆయిల్, నిజామాబాద్‌లో మధుమేహానికి ఆయుర్వేద ఔషధం పేరుతో ఉసిరి జ్యూస్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పలు సంస్థలు తమ లేబుళ్లపై న్యూమోనియా, డయాబెటిస్ చికిత్స కోసం పని చేస్తాయని విక్రయిస్తున్నట్లు తెలిసి చర్యలు చేపట్టారు. ప్రజలు ఇలాంటి ఔషధాల పట్ల అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ఇలాంటి ఔషధాల విక్రయాలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-6969కు ఫిర్యాదు చేయాలని డ్రగ్ కంట్రోల్ అధికారులు సూచించారు.

Also Read: Hyderabad News: పట్టపగలే నడిరోడ్డుపై తాగుతూ యువతీ, యువకుడు హంగామా - చివరకు!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Most Sugar Produced States: భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
Embed widget