News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TS Crime: తల, మొండెం కేసులో వీడని మిస్టరీ... నరబలి కోణంలో పోలీసుల ముమ్మర దర్యాప్తు...

నల్గొండ జిల్లా విరాట్ నగర్ కాలనీలో తల, మొండెం కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. హత్యకు గురైన వ్యక్తిని గుర్తించిన పోలీసులు... 2018లో జరిగిన ఓ హత్య కేసుతో ఏదైనా సంబంధం ఉందా అని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం విరాట్ నగర్ కాలనీలో మైసమ్మ గుడి ముందు మనిషి తల ఉన్న కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  జైహింద్ నాయక్ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. నరబలి కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును రాచకొండ, నల్గొండ  పోలీసులు ఉమ్మడిగా దర్యాప్తు చేస్తున్నారు. రాచకొండ ఎస్వోటీ, నల్గొండ సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. వారం రోజులు గడుస్తున్నా నిందితుల ఆచూకీ దొరకలేదు. ఈనెల 10న సాగర్ హైవే మెట్టుమహంకాలి పాదాల వద్ద జైహింద్ తల దొరికింది. హత్య జరిగిన నాలుగు రోజుల తర్వాత హైదరాబాద్ తుర్కయాంజల్ లో నిర్మాణంలో ఉన్న ఇంటిపై తల లేని మొండం లభించింది. హత్యకు గురైన వ్యక్తి సూర్యాపేట జిల్లా  శూన్య పహాడ్ తండాకు చెందిన జైహింద్ నాయక్ గా పోలీసులు గుర్తించారు. 

Also Read: Corona Updates: పోలీస్ శాఖపై కరోనా పంజా... హైదరాబాద్ పరిధిలోని పలు పీఎస్ లలో భారీగా కేసులు...

ఆ హత్యతో ఏదైనా సంబంధం..?

2018 కేశవనాయక్ హత్య ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తండాలోని ఇంటి యాజమానులతో పాటు పలువురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సీసీటీవీ కెమెరాలు, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Also Read: ములుగు జిల్లాలో ఎదురుకాల్పులు... నలుగురు మావోయిస్టుల మృతి

నరబలి కోణంలో దర్యాప్తు

నల్గొండ జిల్లాలో జైహింద్‌ నాయక్‌ (30) మతి స్థిమితం లేని వ్యక్తి దారుణహత్య సంచలనమైంది. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లోని ఓ భవనంపై జైహింద్‌ నాయక్‌ మొండాన్ని పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నాగార్జున సాగర్‌, హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కనే విరాట్‌నగర్‌ కాలనీలో మెట్టు మహంకాళీ అమ్మవారి విగ్రహం కాళ్ల వద్ద మొండెం లేని తలను ఉంచారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన తల ఫొటో ఆధారంగా మృతుడ్ని జైహింద్‌ నాయక్‌ అని పోలీసులు గుర్తించారు. అతడిది సూర్యాపేట జిల్లా పాకలవీడు మండలం శూన్యపహాడ్‌ తండా అని నిర్ధారించారు. దారుణహత్యను గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. కేసు మిస్టరీని చేధించేందుకు 8 పోలీసు టీమ్ లను నియమించారు. 

Also Read: చెల్లి శవంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే అక్క.. అది కుళ్లడంతో చివరికి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Jan 2022 04:48 PM (IST) Tags: telangana news TS News Nalgonda Crime News jaihind nayak murder

ఇవి కూడా చూడండి

Hyderabad News: కుప్పకూలిన బతుకులు, స్లాబ్‌ కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం

Hyderabad News: కుప్పకూలిన బతుకులు, స్లాబ్‌ కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు

Telangana: ఇటుక లోడ్ ట్రాక్టర్ బోల్తా, చెక్ చేసిన పోలీసులు షాక్- 5 క్వింటాళ్ల గంజాయి లభ్యం

Telangana: ఇటుక లోడ్ ట్రాక్టర్ బోల్తా, చెక్ చేసిన పోలీసులు షాక్- 5 క్వింటాళ్ల గంజాయి లభ్యం

ACB Raids: ఏసీబీ మెరుపుదాడులు - రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మార్వో, ఆర్ఐ

ACB Raids: ఏసీబీ మెరుపుదాడులు - రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మార్వో, ఆర్ఐ

Hyderabad Boy Death: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడి మృతి, పది నిమిషాలకే అంత ఘోరం - పజిల్‌గా మారిన కేసు!

Hyderabad Boy Death: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడి మృతి, పది నిమిషాలకే అంత ఘోరం - పజిల్‌గా మారిన కేసు!

టాప్ స్టోరీస్

IND Vs AUS: వార్ వన్‌సైడ్ - రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 99 పరుగులతో భారత్ విజయం!

IND Vs AUS: వార్ వన్‌సైడ్ - రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 99 పరుగులతో భారత్ విజయం!

Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్

Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్

Kushi OTT Release Date: 'ఖుషి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Kushi OTT Release Date: 'ఖుషి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ బుక్ చేసుకుంటే ఎంత కాలం ఎదురు చూడాలి? - వెయిటింగ్ పీరియడ్లు ఎలా ఉన్నాయి?

Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ బుక్ చేసుకుంటే ఎంత కాలం ఎదురు చూడాలి? - వెయిటింగ్ పీరియడ్లు ఎలా ఉన్నాయి?