అన్వేషించండి

Telangana Crime News: తెలంగాణలో దారుణం! దారి కోసం వివాదం, అన్నదమ్ముల హత్య

Telangana Crime News: హృదయాలను కదిలించి వేసే ఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్‌ గ్రామంలో జరిగింది. భూమి దారి కోసం జరిగిన వివాదం ఏకంగా రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.

Jagtial Crime News: తెలంగాణలోని జగిత్యాల జిల్లా (Jagtial News)లో దారుణం జరిగింది. భూమి విషయంలో జరిగిన గొడవ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల హత్యకు (Brothers Murder) కారణమైంది. గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. హృదయాలను కదిలించి వేసే ఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం (Buggaram Mandal News) గోపులాపూర్‌ గ్రామంలో జరిగింది.

స్థానిక ఎస్సై శ్రీధర్ రెడ్డి వివరాల మేరకు.. బుగ్గారం మండలం గోపులాపూర్‌లో దివిటి శ్రీనివాస్ నివాసం ఉంటున్నారు. ఆయన రెండేళ్ల క్రితం తన ఇంటి పక్కనే మరో ఇంటిని కొనుగోలు చేశాడు. దాని పక్కనే అదే గ్రామానికి చెందిన బుర్రా నవీన్ (Burra Naveen) ఇల్లు సైతం ఉంది. కొత్తగా కొనుగోలు చేసిన ఇంటికి దారి విషయంలో నవీన్‌, శ్రీనివాస్‌కు తరచూ వాగ్వాదాలు, గొడవలు జరుగుతున్నాయి. 

ఈ క్రమంలో శ్రీనివాస్, నవీన్ కుటుంబాల మధ్య గురువారం రాత్రి గొడవ జరిగింది. స్థానికులు కలగజేసుకుని నచ్చజెప్పడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. అనంతరం శ్రీనివాస్ తన పెదనాన్న కుమారుడు మహేష్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటుండగా నవీన్ కొంతమంది యువకులతో అక్కడికి వచ్చాడు. యువకులు ఒక్కసారిగా శ్రీనివాస్‌పై దాడి చేశాడు. మహేష్ వారిని అడ్డుకోవడానికి యత్నించగా అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని  వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహేష్‌కు కుమారుడు, భార్య ఉన్నారు. మృతుడు శ్రీనివాస్ సోదరి మమత ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న ఏఎస్పీ వినోద్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటన గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Golbal Star Ram Charan : అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
Posani Krishna Murali: సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Embed widget