అన్వేషించండి

NEET Aspirant Death: మరికొన్ని గంటల్లో నీట్ పరీక్ష.. రాత్రికి రాత్రే విద్యార్థి ఆత్మహత్య.. భయానికి అదే కారణమా!

మరికొన్ని గంటల్లో నీట్ పరీక్ష ఉండగా.. ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. 

విద్యార్థులు రోజురోజుకూ మరీ సున్నితంగా మారుతున్నారు. ఎవరైనా మందలిస్తే అసలు తట్టుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా పరీక్షల సమయంలో వారు ఒత్తిడిని జయించడంలో విఫలమవుతున్నారు. దాని ఫలితంగా విద్యార్థులు ప్రాణలు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. మరికొన్ని గంటల్లో నీట్ పరీక్ష ఉండగా.. ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. 

తమిళనాడులోని సేలం జిల్లా కూలియూరు గ్రామానికి చెందిన ధనుష్ అనే విద్యార్థి 2019లో ఇంటర్ సెకండియర్ పాసయ్యాడు. ఇదివరకే రెండు పర్యాయాలు నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పరీక్ష రాశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. నేడు మూడో పర్యాయం అతడు నీట్ 2021 పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. కానీ తెల్లారేసరికి ధనుష్ విగతజీవిగా కనిపించాడు. రాత్రి కుమారుడు చదువుకుంటుండగా తల్లిదండ్రులు నిద్రపోయారు. ఉదయం నిద్రలేచి కుమారుడి గదికి వెళ్లి చూడగా షాకయ్యారు. తమ కుమారుడు ఉలుకుపలుకు లేకుందా ఉన్నాడు. ఎంత లేపినా అతడు కళ్లు తెరవలేదు. పరీక్ష నేపథ్యంలో కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మెట్టూరు ఆసుపత్రికి డెడ్ బాడీ తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

Also Read: Formula One: ఫార్ములా వన్ రేసులో ప్రమాదం.. స్టార్ రేసర్ల కార్లు ఢీ.. ఇటాలియన్ గ్రాండ్ ప్రి నుంచి ఇద్దరూ ఔట్

మరోసారి ఫెయిల్ అవుతాననే భయమా.. 
ధనుష్ ఇదివరకే రెండు పర్యాయాలు నీట్ పరీక్షకు హాజరయ్యాడు. అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాడు. ఈసారి పరీక్షలో ఫలితాలు ఎలా వస్తాయోనని ఆందోళనకు గురయ్యాడు. దాంతో ఒత్తిడిని జయించలేక, పరీక్ష భయంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. చదువు గురించి అతడు చాలా ఒత్తిడిని గత రెండేళ్లుగా ఎదుర్కొంటున్నాడని, తాజాగా నీట్ పరీక్ష ముందురోజు అతడు తనువు చాలించాడు.

Also Read: Doctor Suicide: ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. హోటల్‌లో పిల్లల డాక్టర్ ఆత్మహత్య

తన ప్రాంతానికి చెందిన విద్యార్థి, నీట్ అభ్యర్థి ధనుష్‌ ఆత్మహత్యపై అన్నాడీఎంకే కీలక నేత, తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి స్పందించారు. నీట్ అభ్యర్థి మరణంపై డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించారు. నీట్‌ను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదని డీఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

సీఎం స్టాలిన్‌ దిగ్భ్రాంతి..
నీట్ పరీక్ష రాయాల్సిన విద్యార్థి ధనుష్ మరణంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పందించారు. నీట్‌ నుంచి శాశ్వత మినహాయింపును కోరుతూ ఓ బిల్లును అసెంబ్లీలో పాస్‌ చేస్తామన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Nalgonda Crime News: యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget