News
News
X

Doctor Suicide: ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. హోటల్‌లో పిల్లల డాక్టర్ ఆత్మహత్య

కొద్ది వారాల క్రితం సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త ధర్మకారి శ్రీనివాస్ శవాన్ని కారు డిక్కీలో ఉంచి కాల్చి వేసిన కేసులో చంద్రశేఖర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

FOLLOW US: 

కొద్ది రోజుల క్రితం మెదక్ జిల్లాలో దారుణ హత్యకు గురైన ధర్మకారి శ్రీనివాస్ అనే వ్యక్తి గుర్తున్నారా? కారు డిక్కీలో ఆయన శవాన్ని ఉంచి ఆ కారును దగ్ధం చేశారు. ఆ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. 

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఓ హోటల్‌లో ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. మెదక్ పట్టణంలో చంద్రశేఖర్ చిన్న పిల్లల డాక్టర్‌గా కొనసాగుతున్నారు. నిజాంపేటలో ఆయన కుమారుడికి నీట్ పరీక్ష ఉండటంతో అతనికి తోడుగా చంద్రశేఖర్ ఆయన భార్యతో పాటు హైదరాబాద్ వచ్చారు. అయితే, భార్యను ఇంటికి పంపించేసి ఈయన హోటల్‌లో ఆత్మహత్యకు చేసుకున్నారు. 

కొద్ది వారాల క్రితం సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త ధర్మకారి శ్రీనివాస్ శవాన్ని కారు డిక్కీలో ఉంచి కాల్చి వేసిన కేసులో చంద్రశేఖర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లా వెల్ధుర్తి మండలం మంగళపర్తి వద్ద హోండాసిటీ కారు దగ్ధమైన ఘటన వెలుగు చూసింది. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు. హత్యకు గురైంది రియల్ ఏస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన ధర్మకారి శ్రీనివాస్ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. స్వగ్రామం నుంచి ఆయన హైదరాబాద్‌కు వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో అనుమానాస్పద స్థితిలో దారుణ హత్యకు గురయ్యాడు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.కోటి, హైదరాబాద్‌లో మరో రూ.50 లక్షలు రావాల్సి ఉందని ధర్మకారి శ్రీనివాస్ బంధువులు చెప్పారు.

Also Read: Tankbund: ఈ ఆదివారం నుంచి ట్యాంక్ బండ్‌పై మరిన్ని సర్‌ప్రైజ్‌లు.. ఫుల్ ఖుషీలో నగర వాసులు

Also Read: Bandi Sanjay: మీకు సోయే లేదు, అది అమలు చేయాల్సిందే.. కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

Also Read: సీఎం జగన్ పై హీరో విశాల్ ప్రశంసలు... హ్యాట్సాప్ అంటూ ట్వీట్... ఏపీ నిర్ణయాన్ని తమిళనాడులో కూడా అమలుచేయాలని రిక్వెస్ట్

Also Read: KRMB And GRMB Meet: కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీతో కేంద్రం సమావేశం.. అక్టోబర్ 14 నుంచి బోర్డుల పరిధిపై ముందుకేనా?

Published at : 12 Sep 2021 07:00 PM (IST) Tags: Medak car fire Medak Doctor suicide Kukatpally doctor suicide Hyderabad doctor suicide Dharmakari Srinivas murder case doctor chandra sekhar suicide

సంబంధిత కథనాలు

Mla Jagga Reddy : సీఎం జగన్, షర్మిల బీజేపీ వదిలిన బాణాలే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Mla Jagga Reddy : సీఎం జగన్, షర్మిల బీజేపీ వదిలిన బాణాలే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Mahesh Bhagwat: మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? బీ కేర్ ఫుల్! రాచకొండ సీపీ వార్నింగ్

Mahesh Bhagwat: మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? బీ కేర్ ఫుల్! రాచకొండ సీపీ వార్నింగ్

Bandi Sanjay: అమ్మవారి దీక్షలో బండి సంజయ్‌- 9 రోజుల పాటు రాజకీయ విమర్శలకు దూరం

Bandi Sanjay: అమ్మవారి దీక్షలో బండి సంజయ్‌- 9 రోజుల పాటు రాజకీయ విమర్శలకు దూరం

Chakali Ailamma: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కేసీఆర్ సహా నేతల ఘన నివాళి

Chakali Ailamma: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కేసీఆర్ సహా నేతల ఘన నివాళి

E Challan: చలాన్లు పడ్డాయని ఈ ట్రిక్ వాడుతున్నారా? అయినా తప్పించుకోలేరు, కొత్త ఐడియాతో పోలీసులు

E Challan: చలాన్లు పడ్డాయని ఈ ట్రిక్ వాడుతున్నారా? అయినా తప్పించుకోలేరు, కొత్త ఐడియాతో పోలీసులు

టాప్ స్టోరీస్

Viral Video: పాప బ్యాగ్‌లో పాము- ఓపెన్ చేసిన టీచర్, వైరల్ వీడియో!

Viral Video: పాప బ్యాగ్‌లో పాము- ఓపెన్ చేసిన టీచర్, వైరల్ వీడియో!

Salaar: 'సలార్' లీక్స్, డైరెక్టర్ అప్సెట్ - సెట్స్ లో కొత్త రూల్స్!

Salaar: 'సలార్' లీక్స్, డైరెక్టర్ అప్సెట్ - సెట్స్ లో కొత్త రూల్స్!

Director Anish Krishna : స్క్రిప్ట్ కి న్యాయం చేయాలంటే ఇద్దరు వెన్నెల కిషోర్ లు కావాలి | ABP Desam

Director Anish Krishna : స్క్రిప్ట్ కి న్యాయం చేయాలంటే ఇద్దరు వెన్నెల కిషోర్ లు కావాలి | ABP Desam

Sree Vishnu AK Entertainments Movie : ఏకే ఎంటర్ టైన్మంట్స్ లో శ్రీ విష్ణు కొత్త సినిమా షురూ

Sree Vishnu AK Entertainments Movie : ఏకే ఎంటర్ టైన్మంట్స్ లో శ్రీ విష్ణు కొత్త సినిమా షురూ