News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Formula One: ఫార్ములా వన్ రేసులో ప్రమాదం.. స్టార్ రేసర్ల కార్లు ఢీ.. ఇటాలియన్ గ్రాండ్ ప్రి నుంచి ఇద్దరూ ఔట్

అత్యంత వేగంగా వాహనాలు నడిపే ఫార్ములా వన్ రేసులో ప్రమాదం జరిగింది. ఇద్దరు టాప్ రేసర్ల కార్లు ఢీకొనడంతో వారిద్దరూ గ్రాండ్ ప్రి నుంచి మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది.

FOLLOW US: 
Share:

ఫార్ములా వన్ రేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టైటిల్ పోటీదారులుగా భావిస్తున్న లూయిస్ హామిల్టన్, మ్యాక్స్ వెర్‌స్టప్పెన్ రేసు కార్లు ఢీకొన్నాయి. మాంజాలో ఆదివారం జరుగుతున్న ఇటాలియన్ గ్రాండ్ ప్రిలో ఈ ఘటన జరిగింది. 

ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన హామిల్టన్ మరోసారి మెర్సిడెస్ రేసర్‌గా బరిలోకి దిగాడు. రెడ్ బుల్ ఛాంపియన్‌గా వెర్‌స్టప్పెన్ రేసులో పాల్గొన్నాడు. అయితే వీరి కార్లు ఢీకొన్నాయి. వెర్‌స్టప్పెన్ కారు పక్కకు దూసుకెళ్లి నిలిచిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు డ్రైవర్లు రేసింగ్ కార్ల నుంచి బయటకు వచ్చారు. మెడికల్ టీమ్ వీరికి ఏమైనా జరిగిందా అని పరిశీలిస్తుంది.

Also Read: నా పళ్లు ఊడిపోయాయ్.. అందుకు కారణం అదేనా.. ఇంగ్లాండ్ మాజీలకు ఇర్ఫాన్ పఠాన్ దిమ్మతిరిగే రిప్లై

రేసింగ్ కార్లు ఢీకొన్న ఘటనపై వెర్‌స్టప్పెన్ ఘాటుగానే స్పందించాడు. వేరే వాళ్లకు చోటు ఇవ్వకపోవడం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతాయని స్థానిక రేడియోకు తెలిపాడు. వెర్‌స్టప్పెన్ గ్రాండ్ ప్రి ఐదు పాయింట్లతో ప్రారంభించాడు. శనివారం జరిగిన రౌండ్లో రెండో స్థానంలో నిలిచిన హామిల్టన్ రెండు పాయింట్లు సాధించాడు.

నేడు జరిగిన రేస్‌లో వీరు గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. మెక్‌లారెన్ రేసర్ డేనియల్ రికియార్డో చేతిలో డచ్‌‌కు చెందిన వెర్‌స్టప్పెన్ ఓడిపోయాడు. అతను 20 ల్యాప్‌లతో బ్రిటిష్ టీమ్ మేట్ లాండో నారిస్ కంటే ముందుగా రేసును ముగించాడు. మెక్‌లారెన్ లాండో నోరిస్‌ని 20 ల్యాప్‌లు మాత్రం గెలవలేకపోయాడు. మెక్‌లారెన్ 2012 నుండి ఒక్క ఫార్ములా వన్ గ్రాండ్ ప్రి కూడా నెగ్గకపోవడం గమనార్హం.

Also Read: యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 ఫేజ్-2.. ఈ 7 విషయాలు మీకు తెలుసా! 

అంతకు ముందు వెర్‌స్టప్పెన్ రెండవ స్థానంలో రేసులో కొనసాగుతున్నాడు. దాంతో  పిట్‌స్టాప్‌లో 11 సెకన్లు కోల్పోయాడు, దాంతో అతడి స్థానంలో 10కి వెళ్లిపోయింది. అదే సమయంలో హామిల్టన్ నారిస్‌ని అధిగమించాడు. మరోవైపు రికియార్డో అప్పటికే రేసులో దూసుకెళ్తున్నాడు. మూడు ల్యాప్‌లు పూర్తయిన తరువాత హామిల్టన్ వేగాన్ని పెంచాడు ఈ క్రమంలో వెర్‌స్టప్పెన్ కారును ఢీకొట్టాడు. దాంతో అతడి కారు గాల్లోకి లేచి అక్కడే ఆగిపోయింది.

Also Read: చరిత్ర సృష్టించిన ఎమ్మా రదుకాను... 18 ఏళ్లకే యూఎస్ గ్రాండ్ స్లామ్... ఫైనల్ లో వరుస సెట్లలో ఘన విజయం

Published at : 12 Sep 2021 08:36 PM (IST) Tags: Lewis Hamilton Max Verstappen Formula One Hamilton and Verstappen collide

ఇవి కూడా చూడండి

Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్

Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్

Indian Cricket Team: టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్‌ కాంట్రాక్ట్ పొడిగింపు

Indian Cricket Team: టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్‌ కాంట్రాక్ట్ పొడిగింపు

Mukesh Kumar: ఘనంగా టీమిండియా పేసర్‌ పెళ్లి , వరుసగా మోగుతున్న పెళ్లి బాజాలు

Mukesh Kumar:  ఘనంగా టీమిండియా పేసర్‌ పెళ్లి , వరుసగా మోగుతున్న పెళ్లి బాజాలు

Ruturaj Gaikwad: తొలి భారత బ్యాటర్‌ రుతురాజే , అరుదైన రికార్డు సృష్టించిన యంగ్‌ గన్‌

Ruturaj Gaikwad: తొలి భారత బ్యాటర్‌ రుతురాజే , అరుదైన రికార్డు సృష్టించిన యంగ్‌ గన్‌

Wrestling Federation of India: రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు

Wrestling Federation of India: రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు

టాప్ స్టోరీస్

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!