అన్వేషించండి

Andhra News: విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపాల్ - నడవలేని స్థితిలో బాలికలు, అల్లూరి జిల్లాలో అమానవీయ ఘటన

Alluri District: అల్లూరి జిల్లా రంపచోడవరంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. క్రమశిక్షణ పేరుతో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థినులతో 3 రోజుల నుంచి 200 గుంజీలు తీయించగా వారు అస్వస్థతకు గురయ్యారు.

Students Falling Ill With Principal Punishment In Rampachodavaram: క్రమశిక్షణ పేరుతో ఓ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన మాట వినడం లేదని ఏకంగా 3 రోజుల పాటు వారితో ప్రతిరోజూ 100 నుంచి 200 గుంజీలు తీయించారు. వరుసగా నాలుగో రోజు కూడా అదే శిక్ష విధించడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ అమానవీయ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri District) రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసూన, పీడీ కృష్ణకుమారి తమ పట్ల దారుణంగా ప్రవర్తించారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చెప్పిన మాట వినడం లేదని.. క్రమశిక్షణ పేరుతో శుక్రవారం నుంచి ప్రతి రోజూ 100 నుంచి 200 వరకూ గుంజీలు తీయించారు. సోమవారం కూడా ఇలాగే చేయడంతో దాదాపు 50 మంది విద్యార్థినుల వరకూ కాళ్ల నొప్పులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. సాయంత్రానికి కొంతమంది కోలుకోగా వారిని డిశ్చార్జి చేశారు. మరికొంత మంది విద్యార్థినులు ఇంకా చికిత్స పొందుతున్నారు.

ఎమ్మెల్యే ఆగ్రహం

ఈ ఘటనపై ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థినులను గుంజీలు తీయించడం దారుణమని అన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలానికి సూచించారు. స్థానిక ఏరియా ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించి వారితో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదని.. తన సొంత డబ్బులతో తమకు భోజనం పెడుతున్నానని ప్రిన్సిపాల్ తమతో అంటున్నట్లు బాలికలు ఎమ్మెల్యే ఎదుట కంటతడి పెట్టారు. దీంతో వారిని ఓదార్చిన ఎమ్మెల్యే.. ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాలని భరోసా ఇచ్చారు.

మరోవైపు, తమ పిల్లలతో గుంజీలు తీయించడం పట్ల వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్, పీడీలపై చర్యలు తీసుకోవాలని.. వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఈ ఘటనపై స్పందించాలని కోరుతున్నారు.

Also Read: Anna Canteens: ఈనెల 18న అనంతపురంలో మరికొన్ని అన్న క్యాంటీన్లు ప్రారంభం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Embed widget