Crime News: ఏపీలో తీవ్ర విషాదాలు - ఇంటి మిద్దె కూలి ముగ్గురు, షెడ్డు కూలి ఇద్దరు మృతి
Andhra News: అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
People Died Due To House Collapse In Anantapuram: ఏపీలో బుధవారం తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఓ చోట ఇంటి మిద్దె కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. సత్యసాయి జిల్లా (Satyasai District) ఇంటి పైకప్పు షెడ్డు కూలి మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కుందుర్పిలో ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో వీరు ఉంటున్న ఇల్లు దెబ్బతింది. దీనికి తోడు మిద్దెపై వర్షపు నీరు నిలిచింది. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున మిద్దె కూలగా ముగ్గురు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు గంగన్న, శ్రీదేవి, సంధ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
అటు, సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం శెట్టిపల్లి గ్రామంలో ఇంటి పైకప్పు షెడ్డు కూలి ఇద్దరు దుర్మరణం చెందారు. గ్రామ శివారులో శివారెడ్డి అనే రైతు పొలం దగ్గర నిర్మాణం చేస్తున్న షెడ్డు పైకప్పు ఒక్కసారిగా కుప్పకూదడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కూలి నారాయణరెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి శివారెడ్డిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Pushpa 2: ఏపీలో పుష్ప 2 ఫీవర్ - ఫ్లెక్సీలో మాజీ సీఎం జగన్ ఫోటో, మీకోసం మేము వస్తామంటూ పోస్టర్