అన్వేషించండి

Pushpa 2: ఏపీలో పుష్ప 2 ఫీవర్ - ఫ్లెక్సీలో మాజీ సీఎం జగన్ ఫోటో, మీకోసం మేము వస్తామంటూ పోస్టర్

Anantapuram News: ఏపీలో పుష్ప 2 సినిమా పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. అనంతపురం జిల్లా గుత్తిలో సినిమా ఫ్లెక్సీలో జగన్ ఫోటో దర్శనమిచ్చింది. మీ కోసం మేం ఉన్నామంటూ అందులో రాశారు.

Jagan Photo On Pushpa 2 Flexi: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా పుష్ప 2 (Pushpa 2) మేనియా నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సినిమా కోసం యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లు సైతం ఊహించని రీతిలో చేశారు. తాజాగా, పుష్ప 2 ఫ్లెక్సీలు సైతం వైరల్ అవుతున్నాయి. అనంతపురం గుత్తి పట్టణంలోని ఓ థియేటర్‌లో పుష్ప 2 ఫ్లెక్సీలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఫోటోను వేశారు. 'మాకోసం నువ్వు వచ్చావు.. మీ కోసం మేము వస్తాం.. తగ్గేదేలే' అంటూ ఆ పోస్టర్‌లో రాశారు. కాగా, సోషల్ మీడియాలో వైరల్ కాగా సినీ, రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, పుష్ప 2 సినిమాకు వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు, పిఠాపురంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పుష్ప 2 సినిమా పోస్టర్లను చించేశారు. దీంతో ఆందోళన నెలకొంది.

అటు, మెగా అభిమానులు పుష్ప 2 చూడొద్దంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్ ఎక్కడా మెగాస్టార్ ప్రస్తావన కానీ మెగా ఫ్యామిలీ ప్రస్తావన కానీ తీసుకురాకపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే, వైసీపీ శ్రేణులు బన్నీకి మద్దతుగా నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో తన స్నేహితుడు, వైసీపీ నేత శిల్పారవి ఇంటికి వెళ్లి మద్దతుగా నిలిచారు. అయితే, ఆ సమయంలో వేలాది మంది అభిమానులు తరలిరాగా.. బన్నీతో పాటు శిల్పా రవిపై పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఇటీవలే ఆ కేసును హైకోర్టు కొట్టేసింది. 

'పుష్ప 2ను అడ్డుకుంటాం'

అటు, పుష్ప 2 అడ్డుకుంటామంటూ కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన జనసేన నేత చలమలశెట్టి రమేశ్ బాబు హెచ్చరించారు. 'అల్లు అర్జున్ పోకడ మెగా అభిమానులు, జన సైనికులకు చాలా బాధ కలిగించింది. మెగా ఫ్యామిలీని ఎన్నికల సమయంలో వ్యతిరేకించావ్. ప్రాణాలను లెక్కచేయకుండా పవన్ రాష్ట్రం కోసం అహర్నిశలు పని చేస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్‌ను నువ్వు గుర్తించలేదు అల్లు అర్జున్. అహంతో వ్యవహరిస్తున్నావ్ అంటూ మండిపడ్డారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుకు క్షమాపణలు చెప్పాలి. చిరంజీవి కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. ఇప్పటికైనా అల్లు అర్జున్ పద్ధతి మార్చుకోకుంటే జనసేన అభిమానులు, మెగా ఫ్యాన్స్ సినిమా విడుదలను అడ్డుకుంటాం' అని హెచ్చరించారు.

హైకోర్టులో పిటిషన్

మరోవైపు, పుష్ప 2 సినిమా విడుదలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో తాజాగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అదనపు షోలకు అనుమతి ఇవ్వడం, టికెట్ల ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలను ఇందులో సవాల్ చేశారు. పుష్ప సినిమాలో రూ.100 కోట్లు వినియోగించినట్లు ఆధారాలు సమర్పించలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రతివాదులుగా పుష్ప నిర్మాతలు, అల్లు అర్జున్, హీరోయిన్స్ శ్రీలీల, రష్మికను చేర్చారు. దీనిపై తగు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. కాగా, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. 

Also Read: Kakinada MLA News: పార్టీల్లో వైసీపీ దొంగలు చేరుతారు జాగ్రత్త- కాకినాడ ఎమ్మెల్యే వనమాడి హెచ్చరిక

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget